Mercury retrograde 2023: ఈరోజు నుంచి 9 రోజులపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..లాభాలే లాభాలు..

Budh Vakri 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజుగా పిలుస్తారు. ఇతడి గమనంలో మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. తిరోగమన బుధుడు మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2023, 05:31 PM IST
Mercury retrograde 2023: ఈరోజు నుంచి 9 రోజులపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..లాభాలే లాభాలు..

Mercury retrograde 2023: అష్టగ్రహాల్లో బుధుడు కూడా ఒకరు. ఈ గ్రహం సూర్యుడికి అతి దగ్గరగా ఉంటుంది. అందుకే ఇతడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. సంపద, వ్యాపారం మరియు తెలివితేటలకు కారకుడిగా మెర్క్యూరీని భావిస్తారు. రీసెంట్ గా బుధుడు ఆగస్టు 24న తిరోగమనం చేశాడు. ఇదే స్థితిలో అతడు సెప్టెంబరు 15 వరకు ఉంటాడు.  బుధుడు రివర్స్ కదలిక కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. మెర్క్యూరీ తిరోగమనం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

కర్కాటకం
బుధుడి తిరోగమనం కర్కాటక రాశి వారికి లాభాలను ఇస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అప్పుగా ఇచ్చిన ధనం చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారులు భారీగా లాభపడతారు.
వృషభం
మెర్క్యురీ రివర్స్ కదలిక వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. జాబ్ మారాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 
తులారాశి
బుధుడి తిరోగమనం తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. సమాజంలో మీరు గౌరవాన్ని పొందుతారు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది.  పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. 

Also Read: Lucky Zodiac Signs: లక్ష్మీదేవికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News