Numerology Lucky Numbers: చాలామంది నంబర్లను సెంటిమెంట్‌గా భావిస్తారు. క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలలో ఈ నంబర్లపై కాస్త నమ్మకం ఎక్కువగానే ఉంటుంది. వాహనాలకు లక్కీ నంబరు కోసం వేలంలో పడడం మనం చూస్తునే ఉన్నాం. న్యూమరాలజీ అనేది ఒక పురాతన శాస్త్రం అనేది అందరికీ తెలిసిందే. పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల స్వభావం, భవిష్యత్ గురించి న్యుమరాలజీలో సమాచారంఉంటుంది. ఇందులో ర్యాడిక్స్ నంబర్లపై ఎక్కువ దృష్టి ఉంటుంది. పుట్టిన తేదీ ఆధారంగా ర్యాడిక్స్ నంబర్లు వస్తాయి. ముఖ్యంగా పెళ్లి చేసుకునే సమయంలో అమ్మాయిల విషయంలో చెక్ చేసుకుంటూ ఉంటారు. రాడిక్స్ నంబర్ 2 ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం ఉత్తమ ఎంపిక అని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
న్యూమరాలజీ ప్రకారం.. రాడిక్స్ నంబర్ 2 ఉన్న అమ్మాయిలు తమ భర్త జీవితంలో పాజిటివ్ వైబ్స్ తీసుకువస్తారు. భర్త ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ సంఖ్య ఉన్న అమ్మాయిలు తమ తెలివితేటలతో భర్తకు అండగా నిలబడి ధైర్యాన్ని ఇస్తారు. అయితే వీళ్లు ఎక్కువ ఎమోషనల్‌గా ఉంటారు. అంతేకాకుండా అత్యంత భావోద్వేగంతో ఉంటారు.
ఈ నంబరు ఉన్న అమ్మాయిలు సంబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అంటే బలహీనంగా ఉన్నారని అర్థం కాదు. పవర్‌ఫుల్‌గా ఉన్నా.. సున్నితత్వంగా ఉంటారు. కుటుంబ సభ్యులందరితో మంచి సంబంధాలను ఏర్పరుస్తుంది. రాడిక్స్ నంబర్ 2 ఉన్న అమ్మాయిలు ఎలాంటి సందర్భంలో అయినా భర్తకు మద్దతుగా ఉంటారు. కష్ట సమయాల్లో ఏ మాత్రం వెనక్కి తగ్గారు. కుటుంబంలో ఆనందాన్ని నింపుతారు. భర్త పట్ల ఆమెకున్న విధేయత, ప్రేమ, అవగాహనతో మంచి ఇల్లాలిగా ఉంటారు. ఇంట్లో గొడవలు లేకుండా.. శాంతి ఉండేలా చూసుకుంటారు.
(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ నమ్మకాలు, న్యూమరాలజీ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Health Tips in Telugu: పాలలో ఖర్జూరం మరగబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి తీసుకుంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook