PDS Rice Smuggling: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ బియ్యం రవాణా తీవ్ర వివాదాస్పదంగా మారింది. బియ్యం అక్రమ రవాణాను కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేస్తూనే నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇది పెద్ద కుంభకోణంగా పేర్కొన్న ఆమె వెంటనే సీఐబీతో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. పేదల పొట్టకొట్టి ప్రజల డబ్బును పందికొక్కుల్లా కొందరు తింటున్నారని ఆరోపించారు.
Also Read: YS Sharmila: వైఎస్ షర్మిలపై రేగుతున్న అసమ్మతి, పదవి పోనుందా
కాకినాడ్ ఎయిర్‌పోర్టులో పవన్ కల్యాణ్ చేసిన హైడ్రామాపై సోమవారం 'ఎక్స్' వేదికగా షర్మిల స్పందించారు. 'రాష్ట్రంలో రేషన్ బియ్యం విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా. ఇదో జాతీయ స్థాయి కుంభకోణం' అని ఆరోపించారు. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ అని వివరించారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read: New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉందా, క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
'కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉంది. ఎవరికి దక్కాల్సిన వాట వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుంది' అని షర్మిల మండిప్డారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అని తెలిపారు.
'అక్రమ బియ్యాన్ని పట్టేందుకు మీరు బోట్లు వేసుకొని సముద్రంలో హడావిడి చేయడం కాదు. నిజాలు నిగ్గు తేల్చండి' అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుంది? మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు? దీని వెనుక ఉన్న బియ్యం దొంగలెవరు ? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు? గత ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా? తీగ లాగితే వెనకున్న డొంక ఎక్కడ? మిల్లర్ల చేతివాటం ఉందా? రేషన్ డీలర్ల మాయాజాలమా?' అంటూ కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
'అనునిత్యం తనిఖీల సంగతి ఏంటి? నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది' అని షర్మిల గుర్తు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలని.. లేదంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రపంచానికి అన్నం పెట్టే మన రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. 'ఆరుగాలం కష్టించి పడించే రైతుకు దక్కేది కన్నీళ్లు అయితే.. బియ్యం అక్రమార్కులకు దక్కుతున్నవి కాసులు' అని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.