Kanguva OTT: ఓటీటీ లోకి కంగువ.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే..?

Kanguva OTT platform:తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం కంగువ. ప్రముఖ డైరెక్టర్ శివా దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక తాజాగా ఓటీటీ కి సిద్ధమైనట్లు సమాచారం.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 2, 2024, 01:32 PM IST
Kanguva OTT: ఓటీటీ లోకి కంగువ.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే..?

Kanguva Watch Online : కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సూర్య ప్రముఖ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కంగువ. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య సినిమా వచ్చింది కానీ అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో దాదాపు రూ.350 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.100 కోట్ల వరకు కూడా వసూళ్లు రాబట్టలేదని సమాచారం. 

బడ్జెట్లో సగం కూడా రాబట్టనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా త్వరలోనే ఏ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లు సమాచారం. కంగువ సినిమా విడుదలకు ముందు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అవ్వడంతో ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ కూడా భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

ఈ సినిమా విడుదలైన నెల రోజులకు అంటే డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ కి మరో షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఇకపోతే మరికొద్ది రోజుల్లో సినిమా నేపథ్యంలో ఆన్లైన్లో కంగువ హెచ్డి క్వాలిటీ ప్రింట్ లీక్ అవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఇకపోతే ఓటిటిలో కూడా ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఇది అమెజాన్ ప్రైమ్ కి అతిపెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సూర్య భారీ అంచనాల మధ్య విడుదల చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాకముందే లీక్ అవడంతో చిత్ర బృందం సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సూర్య ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కానీ ఈ సినిమా విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: RS Praveen Kumar: 'కొండా సురేఖకు మతిస్థిమితం లేదు.. ఆమె నేర చరిత్ర వరంగల్‌ ప్రజలకు తెలుసు'

Also Read: Deeksha Diwas: కేసీఆర్ హిమాలయమైతే.. రేవంత్‌ రెడ్డి ఆయన కాలిగోటికి సరిపోడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

Trending News