Personality by Zodiac: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వ్యక్తుల రాశులు, జన్మ జాతకాలను బట్టి వారి యోగ్యత, దోషాలను అంచనా వేయవచ్చు. ముఖ్యంగా రాశులను బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు. వ్యక్తిత్వం విషయంలో పలు రాశుల మధ్య సారూప్యతలు ఉండవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా సారూప్యత కలిగిన రాశులు నాలుగు ఉన్నాయి. ఈ నాలుగు రాశుల వారు అత్యంత తెలివైనవారు, జీవితంలో కచ్చితంగా సక్సెస్ అవుతారు.
మేషం (Aries) : ఎంతటి సంక్లిష్ఠ విషయాన్నైనా ఈ రాశి వారు సులువుగా గ్రహించగలరు. ఏ పనైనా త్వరగా నేర్చుకోలరు. శక్తి సామర్థ్యాలు మెండుగా ఉంటాయి. జీవితంలో ఎప్పుడూ ముందుండాలని ఆరాటపడుతారు. అందుకు తగినట్లే కష్టపడుతారు. స్వతహాగా తెలివైవారు కాబట్టి జీవితంలో సక్సెస్ అవుతారు.
వృషభం (Taurus) : వృషభ రాశి వారు చాలా తెలివితేటలు కలవారు. తాము చేసే పనులతో నలుగురిలో మంచి గుర్తింపు, గౌరవం పొందుతారు. ఇతరులు కూడా వీరి నుంచి సలహాలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఓడిపోయే పరిస్థితులు ఎదురైనా కుంగిపోరు. స్థిర చిత్తంతో ముందుకు సాగుతారు. జీవితంలో ఉన్నత స్థితిని చేరుకుంటారు.
మిథునం (Gemini) : మిథున రాశి వారి తెలివితేటలు ఇతరులను ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. ఏ పనైనా వీరు తెలివితేటలు ఉపయోగించి సులువుగా పూర్తి చేయగలరు. మనసులో ఎప్పుడూ కల్మషం ఉండదు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి దూరదృష్టి ఎక్కువ. జరగబోయే దానిని ముందే అంచనా వేస్తారు. తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన ఏ పనైనా సీరియస్‌గా తీసుకుంటారు. అద్భుతమైన తెలివితేటలలతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణిస్తారు.
వృశ్చికం (Scorpio): వృశ్చిక రాశి వారు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. కష్టపడే తత్వం కలిగి ఉంటారు. చేపట్టిన పని పూర్తయ్యేంతవరకూ వెనక్కి తగ్గరు. జీవితంలో గొప్ప విజయాలను అందుకుంటారు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీనిని నిర్ధారించలేదు.)
Also Read: KCR Delhi Tour:వారం తర్వాత హైదరాబాద్ కు కేసీఆర్.. ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్లు.. ఏం చేసినట్లు?
Also Read: Anagaraka Yoga: అంగారక యోగంతో ఈ 5 రాశుల వారికి పొంచి ఉన్న ముప్పు.. ఆగస్టు 10 వరకు జాగ్రత్తగా ఉండాలి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook