Saturn Effect: ఏప్రిల్ 29 నుంచి శని గుప్పిట్లో రానున్న ఆ రాశివారు.. 23 ఏళ్ల తరువాత వారికి దుష్పరిణామాలు!

Saturn Effect: శని రాశి దాటుతూనే ధనురాశి జాతకులపై శని ప్రభావం పోతుంది. కానీ మీనరాశి జాతకులపై శని ప్రభావం ప్రారంభమైపోతుంది. ఆర్ధికంగా, శారీరకంగా, మానసికంగా నష్టం చేకూరుస్తుంది. ఆ వివరాలు పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 10, 2022, 03:36 PM IST
Saturn Effect: ఏప్రిల్ 29 నుంచి శని గుప్పిట్లో రానున్న ఆ రాశివారు.. 23 ఏళ్ల తరువాత వారికి దుష్పరిణామాలు!

Saturn Effect: శని రాశి దాటుతూనే ధనురాశి జాతకులపై శని ప్రభావం పోతుంది. కానీ మీనరాశి జాతకులపై శని ప్రభావం ప్రారంభమైపోతుంది. ఆర్ధికంగా, శారీరకంగా, మానసికంగా నష్టం చేకూరుస్తుంది. ఆ వివరాలు పరిశీలిద్దాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహమనేది చాలా నెమ్మదిగా తిరిగే గ్రహం. రాశి మారడానికి శనిగ్రహానికి ఏకంగా రెండున్నరేళ్లు పడుతుంది. శని గ్రహం కదలికలు ఇతర రాశులపై ప్రభావం చూపిస్తుంటాయి. శని అనేది చేసిన కర్మల ప్రకారం ఫలాలిచ్చే దేవత. అందుకే శనిని న్యాయదేవత అని కూడా పిలుస్తారు. ప్రత్యేకించి శని మహర్దశ ఉన్న సమయంలో సదరు వ్యక్తులకు వారి కర్మలు, కుండలిలో శని పరిస్థితి ఆధారంగా ప్రతిఫలం లభిస్తుంటుంది. ఒకవేళ ఆ స్థితి నెగెటివ్‌గా ఉంటే ఆ వ్యక్తి జీవితం నాశనమైనట్టే.

ఏప్రిల్ 29 న శని గోచారం

కర్మ ఫలాలు ప్రసాదించే శని గ్రహం ఏప్రిల్ 29న రాశి మారనున్నాడు. ఆ రుజు కుంభరాశిలో ప్రవేశిస్తాడు. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కానీ ఒక రాశిపై మాత్రం ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అంటే ఏకంగా ఏడున్నరేళ్లు ఆ ప్రభావం ఉంటుందట. ఏప్రిల్ 29 నుంచి ఆ రాశివారి శని గుప్పిట్లో వచ్చేస్తారు. ఏప్రిల్ 29 న శని కుంభరాశిలో ప్రవేశిస్తూనే మీనరాశి వారిపై శని ప్రభావం ప్రారంభమవుతుంది. అదే సమయంలో ధనరాశివారికి విముక్తి లభిస్తుంది. ఇంకొన్ని రాశులపై కూడా ప్రభావం కన్పిస్తుంది. 

Also read: Fasting Rules & Timings: రంజాన్ ఉపవాసాలు..నియమ నిబంధనలు, సెహ్రీ, ఇఫ్తార్ టైమింగ్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News