Shani Effect: శని అశుభ పరిస్థితుల్లో ఉంటే శాంతి చేసేందుకు ఆలస్యం చేయకూడదు. లేకపోతే భారీ నష్టాన్ని చవిచూడాల్సివస్తుంది. శని ప్రభావం మీపై ఎలా ఉందనేది కొన్ని సంకేతాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు..
శని చెడుదృష్టి..రాజును సైతం కుదేలయ్యేలా చేస్తుంది. అందు శని అంటే అందరూ భయపడతారు. శని న్యాయదేవత కూడా. చేసుకున్న కర్మల ప్రతిఫలం ఇస్తాడు. ఈ నేపధ్యంలో చెడు పనులు చేసేవారికి శని ముప్పు చాలా అధికంగా ఉంటుంది. పేదలు, నిర్భాగ్యులు, కూలీలపై అత్యాచారాలు, ఆకృత్యాలకు పాల్పడేవారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటివారిని శనిదేవుడు దండిస్తాడు. జీవితంలో కల్లోలం సృష్టిస్తాడు. మే 30న ఆ శని దేవుడి జయంతి ఉంది. ఈ క్రమంలో శని ప్రకోపం నుంచి విముక్తులయ్యేందుకు కొన్ని ఉపాయాలున్నాయి. ఇవి పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. శని ప్రకోపం మీపై ఉందో లేదో అనేది ఎలా గుర్తు పట్టవచ్చో తెలుసుకుందాం.
శని చెడు దృష్టి ఎవరిపైనైనా పడిందంటో..లేదా కుండలిలో శని అశుభమైన స్థితిలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో కొన్ని సంకేతాలు ఎదురౌతాయి. శని ప్రకోపం ఉంటే..ఆ వ్యక్తి అప్రమత్తమైపోవాలి. శని దేవుడిని బలోపేతం చేసేందుకు కొన్ని పద్దతులు పాటించాలి.
శని ప్రకోపం ఎలా గుర్తు పట్టాలి, కొన్ని సంకేతాలు
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒకవేళ ఎవరైనా వ్యక్తిపై శని దుష్ప్రభావం పడితే ఆ వ్యక్తి జుట్టు త్వరగా రాలిపోతుంటుంది. ఏదైనా రోగం వల్ల కూడా ఇలా జరగవచ్చు. వెంటనే అటు వైద్యుడిని సంప్రదించడమే కాకుండా ఇటు శని దేవుడిని ప్రసన్నం చేసుకునే పద్ధతులు పాటించాలి.
శని అశుభ ప్రభావం వ్యక్తి జీవితంలో, పనుల్లో రెండింటిపై నష్టం కల్గిస్తుంది. శని అశుభంగా ఉంటే వ్యాపారంలో నష్టం కలుగుతుంది. ధన నష్టం భారీగా ఉంటుంది. మంటలు వ్యాపించవచ్చు. వ్యక్తిగత జీవితంలో ఘర్షణలు ఎదురౌతాయి. ఇంట్లో అశాంతి ఉంటుంది.
శని ప్రకోపముంటే..నుదుట నల్లగా మచ్చ ఏర్పడుతుంది లేదా నుదుటి ప్రకాశం తగ్గిపోతుంది. ఇలా జరగడం గౌరవ మర్యాదలకు భంగం కల్గిస్తుంది. శని ప్రకోపం ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాంసాహారం ఎక్కువగా తినడం ప్రారంభిస్తాడు. అటు మత్తు, జూదం, మట్కాల్లో మునిగితేలుతుంటాడు. అనైతికమైన పనులు చేస్తుంటాడు. శని అశుభ ప్రభావం వ్యక్తి స్వభావంలో విసుగు, కోపానికి కారణమౌతుంటుంది. దాంతోపాటు అబద్ధాలు ఎక్కువగా మాట్లాడుతుంటాడు.
శని ప్రకోపం నుంచి విముక్తులయ్యే మార్గం
మే 30వ తేదీన శని జయంతి నాడు శనీశ్వరాలయానికి వెళ్లి..శనిదేవుడిని పూజించాలి. ఆయిల్, నల్ల నువ్వులు, వంటివి సమర్పించాలి. నూనెతో దీపం వెలిగించాలి. పేదలకు నూనె, నల్లనువ్వులు, పప్పులు, నల్లని వస్త్రాలు, నల్లని చెప్పులు దానంగా ఇవ్వాలి. శని చాలీసా పఠించాలి.
Also read: Shani Jayanti 2022: శని జయంతి నాడు మీ రాశి ప్రకారం దానం చేస్తే... మీ కోరికలు తప్పక నెరవేరుతాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook