Shani Margi 2023: శనిదేవుడుని జ్యోతిష్య శాస్త్రంలో న్యాయ దేవతగా పరిగణిస్తారు. అంతేకాకుండా కర్మదాతగా కూడా చెప్పుకుంటారు. శాస్త్రం ప్రకారం శని దేవుడికి ఎంత ప్రముఖ్యత ఉంటుందో, శని గ్రహానికి కూడా అంతే ప్రాముఖ్య ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే శని గ్రహం సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారి జాతకాలపై ఎఫెక్ట్ పడుతుంది. జాతకంలో శని శుభ స్థానంలో సంచారం చేస్తే అనుకున్న పనులతో పాటు జీవితంలో సమస్యలన్నీ సులభంగా తొలగిపోతాయి. దీంతో పాటు శని జాతకంలో అశుభ స్థానంలో సంచారం చేస్తే ఊహించని నష్టాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే శని గ్రహం కేవలం 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంచారం చేస్తుంది. ఈ సంచారం నవంబర్ 4న ప్రత్యక్షంగా జరగబోతోంది. దీంతో కొన్ని రాశులవారికి అదృష్టం రెట్టింపు అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
వృషభ రాశి:
ఈ సమయంలో వృషభ రాశి వారికి శని దేవుడి విశేష ఆశీస్సులు లభించబోతున్నాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా లాభాదేవీలకు ఇది సరైన సమయంగా కావడం వల్ల..మీరు ఎవరికైన డబ్బులను అప్పుగా, పెట్టుబడి రూపంగా ఇవ్వొచ్చు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి రాబోయే కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
మిథునరాశి:
శని గ్రహం సంచారం కారణంగా మిథునరాశి వారికి అదృష్టం రెట్టింపు అవ్వబోతోందని తెలుస్తోంది. వీరు త్వరలోనే ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. దీంతో పాటు మీరు ఈ సమయంలో డబ్బులతో భవనాలు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్‌లో ఊహించని ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. వీరికి సులభంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. లక్ష్మిదేవి ఆశీస్సులు లభించి భారీ లాభాల పొందుతారు.
సింహ రాశి:
శని ప్రత్యేక్షంగా సంచారం చేయడం వల్ల సింహ రాశివారు అనుకున్న పనులన్నీ సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు వీరికి ఆర్థిక స్థితి చాలా బలంగా మారుతుంది. కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టొచ్చు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించి కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి