Sheetala Ashtami 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని కృష్ణ పక్ష అష్టమి నాడు శీతల అష్టమి అంటారు. ఈ పండుగను బసోడా అని కూడా అంటారు. గ్రంథాల ప్రకారం, హోలీ అనంతరం ఎనిమిదో రోజున శీతల అష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజున ఉపవాసం ఉండి శీతల మాతను పూజించడం వల్ల అనేక రోగాలు, దోషాల నుండి విముక్తి పొందడంతోపాటు దీర్ఘాయుష్షు లభిస్తుంది. ఈరోజున శీతల మాతకు పాత ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు. శీతల అష్టమి తిథి, శుభ సమయం మరియు పూజా విధానాన్ని తెలుసుకోండి.
తేదీ, శుభ ముహూర్తం
చైత్ర మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి ప్రారంభం - మార్చి 15 ఉదయం 12.09 గంటలకు
చైత్ర మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి ముగింపు - మార్చి 16 రాత్రి 10.04 గంటలకు.
శీతల అష్టమి పూజకు ఉదయం 06:20 నుండి సాయంత్రం 06:35 వరకు ఉత్తమ సమయం.
పూజా విధానం
అష్టమి రోజున సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. అనంతరం ఉపవాస దీక్షను తీసుకోండి. తల్లి శీతల మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి.. పువ్వులు, అక్షతలు, కుంకుమ, మేకప్ కిట్ ను సమర్పించండి. పాత ఆహారాన్ని నైవేద్యంగా పెట్టండి. దీపం వెలిగించి శీతల స్తోత్రాన్ని పఠించండి. చివరగా హారతి ఇచ్చి పూజను విరమించండి.
Also read: Surya Gochar 2023: ఆదిత్యుడి మీనరాశి ప్రవేశం.. ఈ 4 రాశులు పట్టిందల్లా బంగారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook