Shukra Pradosh Vrat Puja Vidhanam: ప్రదోష వ్రతం ప్రతినెలా రెండుసార్లు ఆచరిస్తారు. ఈ ప్రదోష వ్రతంలో శివపార్వతులను పూజించడం వల్ల మీరు కోరిన కోరికలు తీరుతాయి.ప్రదోష వ్రతం సోమవారం నాడు వస్తే దానిని సోమ ప్రదోషం అని, శుక్రవారం వస్తే దానిని శుక్ర ప్రదోషం అని అంటారు. ఈరోజు అంటే సెప్టెంబర్ 23 శుక్ర ప్రదోషం (Shukra Pradosh Vrat 2022). శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ ప్రదోష వ్రతం రోజున శివ-పార్వతులతో పాటు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు విశేషమైన ప్రయోజనాలను పొందుతారు.
శుభ సమయం
ఆశ్వినీ మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తిథి సెప్టెంబర్ 23 శుక్రవారం ఉదయం 01.17 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 23 తెల్లవారుజామున 02:30 గంటలకు ముగుస్తుంది. అంటే దీని ప్రకారం సెప్టెంబర్ 23న శుక్ర ప్రదోష వ్రత పూజ జరుపుకుంటారు. పూజకు సంబంధించి మూడు శుభముహూర్తాలు ఉన్నాయి.
అభిజిత్ ముహూర్తం - మధ్యాహ్నం 12:07 నుండి 12:55 వరకు.
అమృత కాలం - మధ్యాహ్నం 1.16 నుండి 2:59 వరకు.
సాయంత్రం 6.22 నుండి 6.46 వరకు సంధ్యా సమయంలో పూజకు శుభ ముహూర్తం ఉంది.
శుక్ర ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత
ప్రదోష వ్రతం శివునికి అంకితం చేయబడింది. ప్రదోష వ్రతం ఆచరించి శివుని పూజించడం వల్ల అన్ని రకాల కష్టాల నుండి విముక్తి పొందుతారు. జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీ పిల్లల లైఫ్ బాగుంటుంది. ఈ శుక్ర ప్రదోష వ్రతం ఆర్థికంగా మీకు లాభం చేకూరుస్తుంది.
ప్రదోష వ్రత పూజా విధానం
ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి, ఉపవాస దీక్ష తీసుకోండి. తర్వాత ఇంటి పూజగదిని శుభ్రం చేసి.. దేవుడి ముందు దీపం వెలిగించండి. అనంతరం శివలింగానికి పాలాభిషేకం, జలాభిషేకం చేయండి. తర్వాత గణపతితోపాటు శివపార్వతులను ఆరాధించండి. సాయంత్రం స్నానం చేసి ప్రదోష కాలంలో మళ్లీ పూజ చేయండి. తర్వాత ఈశాన్య దిక్కుకు అభిముఖంగా ఉండి కుశ ఆసనంలో కూర్చోవాలి. శివునికి జలాభిషేకం చేసిన తర్వాత చందనం, అక్షత, మొల, ధూపం, దీపాలతో పూజించాలి. శివునికి అన్నం, పాయసం మరియు పండ్లు నైవేద్యంగా పెట్టండి. చివరికి, 'ఓం నమః శివాయ మంత్రం' 108 సార్లు జపించండి. దీని తరువాత రాత్రికి లక్ష్మీ దేవిని పూజించి.. పాలు, ఖీర్ మొదలైన తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టండి. దీంతో లక్ష్మీదేవి సంతోషించి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది.
Also Read: Dhanteras 2022: ధంతేరాస్ నాడు శని సంచారం.. కుబేరుడు ఈ 3 రాశులవారిపై డబ్బు వర్షం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook