Sravana Masam 2022: ప్రస్తుతం భారత్‌లో శ్రావణ మాస నెల నడుస్తోంది. ఈ నెల హిందువులకు ఎంతో ప్రితికరమైందిగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో భక్తులు ఎక్కువగా మహాశివున్ని పూజిస్తారు. శివున్ని పూజించడం వల్ల కోరిన కోరికెలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ మాసంలో చాలా మంది ప్రదోష వ్రతం ఆచరిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో కష్టాలు తొలగిపోయి. అన్ని శుభాలు జరుగుతాయని నిపుణులు పేర్కొన్నారు. ఈ మాసంలో శివున్ని మనస్సుతో పూజిస్తే అన్ని శుభపరిమాణాలు జరుగుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ప్రదోష వ్రతం ఎలా చేసుకోవాలి:
ఇది శ్రావణ మాస నెలలో చేసుకునే పవిత్రమైన వ్రతం. కావున భక్తులు పెద్ద ఎత్తున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రదోష అనే పదాని రాత్రి ప్రారంభం అని అర్థం. రాత్రి వేళల్లో ఉపవాస పూజలు చేయడాన్నే ప్రదోషం అంటారు. అందుకే మహిళలు శ్రావణ మాస నెలలో అధిక సంఖ్యలో ఈ వ్రతాన్ని ఆచరించడం విశేషం.. అయితే ఈ వ్రతాన్ని శ్రావణ శని వారం రోజున చేయడం వల్ల భవిష్యత్‌లో మంచి ఫలితాలు పొందుతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది శనివారం రోజూ ప్రారంభించి శివునికి ప్రితికరమైన రోజూ సోమవారం నాడు రాత్రి ఉపవాస పూజలు చేయడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
శ్రావణ మాస మొదటి ప్రదోష వ్రతం జూలై 25న కృష్ణ పక్ష సోమవారం రోజున వస్తుంది. కావున వ్రతం ప్రారంభించాలనుకునే వారు ఈ రోజు నుంచే చేయోవచ్చు. ఆ తర్వాత గస్టు 9న భౌమ ప్రదోషం రానుంది. అయితే ప్రదోష వ్రతం రోజునా శివుని రుద్రాభిషేకం చేయడం కూడా చాలా ఫలప్రదం. అయితే రేపు కైలస పర్వతంలో శివుడు నృత్యం చేస్తాడు. కాబట్టి దేవతలందరూ స్తుతిస్తారని భక్తుల నమ్మకం. కావున రేపు అందరూ శివున్ని భక్తి శ్రద్ధలతో కొలిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
మహా శివున్ని పూజించడంతో పాటు కథ కూడా చదవండి:
శ్రావణ మాస మొదటి ప్రదోష వ్రతం రోజున శివ పార్వతులకు సంబంధించిన చాలా కథలున్నాయి. వాటిని చదవడం వల్ల కుటుంబం శుఖ సంతోషాలతో ఉంటుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా శాస్త్రంలో పేర్కొన్న శివునికి సంబంధించిన చాలా కథలున్నాయి. వాటిని చదవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ కథలను మీరు ఉపవాస ఉన్న సంబందర్భంలో మాత్రమే చదవాలి. అయితే వీటిని చదివే ముందు పలు రకాల నియమాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. కేవలం శివున్ని పూజించే క్రమంలో, పూజ అనంతరం మాత్రమే చదవాలి. ఇలా వ్రతం రోజున పాటించడం వల్ల భవిష్యత్‌లో మంచి ఫలితాలు పొందుతారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!
Also Read: Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.