Navapanchami Rajayogam 2023: బుధ, శని గ్రహాల కలయిక.. ఏర్పడిన యుతి.. ఈ 5 రాశులపై ధనవర్షం, పదోన్నతి

Sun Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని గ్రహాలపై ఉంటుంది. కొన్ని గ్రహాలపై ప్రతికూలంగా , కొన్ని గ్రహాలపై అనుకూలంగా ఉంటుంది. సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 8, 2023, 04:47 PM IST
Navapanchami Rajayogam 2023: బుధ, శని గ్రహాల కలయిక.. ఏర్పడిన యుతి.. ఈ 5 రాశులపై ధనవర్షం, పదోన్నతి

Sun Transit 2023 in Gemini makes Budhaditya 2023: ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశించడాన్నే గ్రహ గోచారం లేదా రాశి పరివర్తనంగా పిలుస్తారు. గ్రహాల రారాజుగా పిల్చుకునే సూర్యుడు ప్రతి నెలా రాశి మారుతుంటాడు. అదే విధంగా ఇప్పుడు అంటే మరో 9 రోజుల్లో మిధున రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా కొన్ని రాశులకు ఊహించని విధంగా జాతకం మారిపోనుంది.

సూర్యుడి గోచారానికి ఇతర గ్రహాల గోచారానికి తేడా ఉంటుందంటారు జ్యోతిష్య పండితులు. సూర్యుడు రాశి పరివర్తనానికి మహత్యముంటుంది. మరో 9 రోజుల్లో అంటే జూన్ 15వ తేదీన సూర్యుడు మిధున రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ సందర్భంగా బుధ, శని గ్రహాలతో కలిసి యుతి ఏర్పర్చనుండటంతో ఈ 5 రాశుల జాతకం ఊహించని విధంగా మారిపోనుంది. సూర్య, శని, బుధ గ్రహాల కలయికతో బుధాదిత్య నవ పంచమ రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ రాజయోగం ప్రభావం వాస్తవానికి మొత్తం 12 రాశులపై పడుతున్నా 5 రాశులకు మాత్రం ప్రత్యేకం కానుంది. మే 24వ తేదీన బుధుడు ఇదే రాశిలో ప్రవేశించడం, శనితో పాటు యుతి ఏర్పాటు చేయడమౌతుంది. బుధ, సూర్య గ్రహాల కలయికతో బుధాదిత్య రాజయోగం, శనితో కలిసి నవ పంచమ రాజయోగం నిర్మాణం జరగనుంది. ఈ రెండు యోగాలను అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ ఐదు రాశులపై ఊహించని విధంగా కనకవర్షం కురవనుంది. 

మకర రాశి

సూర్యుడి గోచారంతో ఏర్పడే యోగాల కారణంగా మకర రాశి జాతకులకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. సూర్యుడి రాశి పరివర్తనాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఆర్ధిక పరిస్థితి పటిష్టమౌతుంది. ధనలాభం కలగడంతో ఆర్ధికంగా ఏ విధమైన ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం.

Read More: Ind vs Aus Day 1 Highlights: ఇది నా స్టైల్.. వెరైటీగా డీఆర్ఎస్ కోరిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్

కుంభ రాశి

ఇక సూర్యుడి గోచారంతో ఏర్పడే నవ పంచమ రాజయోగం కారణంగా కుంభ రాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉంటు్ంది. వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పనిచేసే చోట ప్రశంసలు లబిస్తాయి. పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులుండవు. విద్యార్ధులకు చాలా అనువైన సమయం. కుటుంబ సంబంధాలు కూడా బాగుంటాయి. అటు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలుండవు.

కర్కాటక రాశి

సూర్యుడితో బుధ, శని గ్రహాల కలయికతో ఏర్పడే బుధాదిత్య, నవ పంచమి రాజయోగాల ప్రభావం ఈ రాశిపై స్పష్టంగా ఉంటుంది. ఎప్పట్నించో పెండింగులో ఉన్న పనులు వెంటనే పూర్తయి..ఆర్ధికంగా చాలా లాభపడతారు. విదేశీ యాత్రలు చేస్తారు. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. పాత పెట్టుబడులు ఒకేసారి లాభాలు కురిపిస్తాయి. ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తత అవసరమంటున్నారు జ్యోతిష్య పండితులు

కన్యా రాశి

సూర్యుడి గోచారం కారణంగా కన్యా రాశి జాతకులకు ఇంటా బయటా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అదే సమయంలో కొత్త బాధ్యతలు కూడా ఆనందాన్నిస్తాయి. వ్యాపారంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఆర్ధికంగా మెరుగైన స్థితిలో ఉంటారు. కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏ సమస్యలుండవు. ఇంట్లో కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడపగలరు.

సింహ రాశి

సూర్యుడు మిధున రాశిలో ప్రవేశించడం వల్ల ఏర్పడనున్న బుధాదిత్య, నవ పంచమ రాజయోగాల ప్రభావం సింహ రాశి జాతకులపై ఊహించని కనక వర్షం కురిపిస్తుంది. ప్రతి రంగంలో విజయం ఈ రాశివారిదే అవుతుంది. ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో ప్రశంసలు లభిస్తాయి. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఎప్పట్నించో రావల్సిన లేదా పెండింగులో ఉన్న డబ్బులు ఒకేసారి వస్తాయి. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

Also Read: Shukra Gochar 2023: కర్కాటక రాశిలో ధన రాజయోగం.. ఈ 4 రాశులవారిపై డబ్బు వర్షం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News