Surya Budh Yuti in Mesham 2023: రీసెంట్ గా గ్రహాల రాజు అయిన సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. మే 14 వరకు సూర్యభగవానుడు మేషరాశిలోనే సంచరించనున్నాడు. బుధుడు ఇప్పటికే మేషరాశిలో ఉన్నాడు. మేషరాశిలో బుధుడు, సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. ఈ యోగం వచ్చే నెల 14 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఐదు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
బుధాదిత్య యోగం ఈ రాశులకు వరం
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి బుధాదిత్య యోగం గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. ఆర్థికంగా మీరు లాభపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. జాబ్ కోసం ప్రయత్నించే వారి కోరిక నెరవేరుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు పొదుపును ఆదా చేస్తారు.
సింహ రాశి: బుధాదిత్య యోగం సింహ రాశి వారికి ధనలాభాన్ని ఇస్తుంది. మీరు ఉద్యోగ, వ్యాపారాలలో చాలా లాభాలను గడిస్తారు. మీరు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు కొత్త ఆర్డర్లను పొందే అవకాశం ఉంది. మీ లాభం పెరుగుతుంది. మీరు కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. మీకు ప్రతి పనిలో విజయం ఉంటుంది.
మేషం: బుధాదిత్య యోగం మేష రాశివారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీలో శక్తి పెరుగుతుంది. మీరు దానిని సరైన దిశలో ఉపయోగిస్తే మీరు చాలా లాభాలను ఆర్జిస్తారు. మీరు చాలా డబ్బు సంపాదిస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
Also read: Mercury Retrograde 2023: బుధుడి వక్రమార్గం 5 రాశులకు అంతులేని డబ్బు, ఊహించని అభివృద్ధి
మిథునం : సూర్యుడు, బుధుడు కలయిక వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది. మీ కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. మీరు కొత్త అవకాశాలు అందుకుంటారు. మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.
ధనుస్సు: మీ కెరీర్ అద్భుతంగా ఉండనుంది. బుధాదిత్య యోగం వల్ల మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీ హృదయం సంతోషంతో నిండిపోతుంది.
Also read: Shani Rahu Yuti 2023: అక్టోబరు 17 వరకు వీరికి అన్నీ సమస్యలే.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook