Grah Gochar 2022: డిసెంబరులో కొన్ని ప్రధాన గ్రహాల సంచారం ఉంది. డిసెంబరులో శుక్రుడు మరియు సూర్యదేవుడు ఒకే రాశిలో సంచరించనున్నారు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, డిసెంబర్ 5న శుక్రుడు, డిసెంబర్ 16న సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోకి (Surya Shukra gochar in Sagittarius 2022) ప్రవేశించనున్నాడు. . ఒకే రాశిలో ఈ రెండు గ్రహాల సంచారం ఏ రాశులను ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.
మిథున రాశి (Gemini): శుక్రుడు రాశి మారడం వల్ల వ్యాపారాలలో చాలా లాభాలు ఉంటాయి. పెళ్లికాని యువతీయువకులు వివాహం కుదిరే అవకాశం ఉంది. సూర్య భగవానుడి సంచారము వల్ల మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.
కర్కాటకం (Cancer): ఈ రాశి వారు ఈ కాలంలో ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే భారీ నష్టాలు చవిచూస్తారు. మీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు.
తులారాశి (Libra): ఈ రాశి వారికి ఒకే రాశిలో ఈ రెండు గ్రహాల సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశివారు శుభవార్తలు వింటారు. ఈ సమయంలో సాహిత్యంతో అనుబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు.
వృశ్చిక రాశి (Scorpio): మీరు వ్యాపారంలో మంచి లాభాలను సాధిస్తారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీ ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది.
ధనుస్సు రాశి (Sagittarius): ఈ సమయం ఆర్థికంగా లాభిస్తుంది. ఆదాయం పెంచుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. పనిలో మీకు విజయం దక్కుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.
Also Read: Chandra Grahan 2022: నేడే చంద్రగ్రహణం.. ఈ రోజు ఏం తినాలి, ఏం తినకూడదో తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి