Tirumala Special Darshan Tickets: వేసవి సెలవులు, ప్రత్యేక రోజుల్లో శ్రీవారి ఆలయంలో భక్తులు పోటెత్తుతుంటారు. వేసవిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది. వేసవిలో శ్రీవారి ఆర్జిత సేవ చేసుకోవాలనుకునే భక్తులకు టీటీడీ శుభవార్త విన్పించింది. వేసవిలో జరిగే ప్రత్యేక దర్శనం టికెట్లు ఎప్పుడెప్పుడు జారీ చేస్తారో తేదీలు ప్రకటించింది.
వేసవిలో సాధారణంగా భక్తులు శ్రీవారి ఆర్జిత సేవల కోసం చూస్తుంటారు.దీనికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మూడు నెలలు ముందుగానే ఆన్‌లైన్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. అంటే రానున్న ఏప్రిల్ నెలలో తిరుమల దర్శనం కోసం ప్లాన్ చేస్తుంటే స్పెషల్ దర్శనంతో పాటు ఇతర టికెట్లను ఈ నెలలోనే బుక్ చేసుకోవచ్చు. తద్వారా మీ వేసవి తిరుమల దర్శనం ప్లాన్ పక్కాగా సాగుతుంది. ఏయే టికెట్లు ఎప్పుడెప్పుడు జారీ చేస్తారో టీటీడీ వెల్లడించింది. ఆ వివరాలు ఓసారి చెక్ చేద్దాం.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా ప్రత్యేకంగా ఉంటుంది. వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఏప్రిల్ నెలలో ఉచితంగా ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్లను జనవరి 23 మద్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు. ఇక అంగ ప్రదక్షిణ టికెట్లను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను కూడా అదే రోజు ఉదయం 11 గంటలకు జారీ చేస్తారు. ఆసక్తి కలిగిన భక్తులు బుక్ చేసుకోవచ్చు.
ఇక ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు వేసవిలో ఏప్రిల్ నెలకు సంబంధించిన స్వామి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. ఈ టికెట్ ఒక్కొక్కటి 300 రూపాయలుంటుంది. తిరుమల, తిరుపతిలో గదుల కోటా కూడా అదే రోజు మద్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఇక ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ కోటా టికెట్లు జారీ కానున్నాయి. స్వామివారి నవనీత సేవ టికెట్లు కూడా అదే రోజు మద్యాహ్నం 12 గంటలు విడుదలవుతాయి. ఇక పరకామణి సేవ టికెట్లు మద్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్ విధానంలో జారీ అవుతాయి. ఈ వేసవిలో తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేస్తుంటే ముందుగానే అందుకు సంబంధించిన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in సందర్శించి బుక్ చేసుకోవచ్చు.
ఇక ఏప్రిల్ 10 నుంచి 12 వరకూ మూడ్రోజులు జరిగే స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవల టికెట్లు నిన్న జనవరి 23 నుంచి అందుబాటులో ఉన్నాయి.
Also read: Civils Notification 2025: సివిల్స్ నోటిఫికేషన్ విడుదల, చివరి తేదీ, అర్హత ఇతర వివరాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి