Ugadi 2024 Lucky Zodiac Sign In Telugu: హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగను కొత్త సంవత్సరంగా భావిస్తారు. హిందువుల నూతన సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 9వ తేదీన వచ్చింది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఉగాది రోజు హిందువులంతా ఎంతో ఘనంగా శ్రీ మహా విష్ణువును పూజించి ఉపవాసాలు పాటిస్తారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన హిందువుల కొత్త సంవత్సరం రోజున దాదాపు 30 ఏళ్ల తర్వాత మూడు అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి. అమృత సిద్ధి యోగం, సర్బార్థ సిద్ధి యోగం, శశ రాజయోగం కూడా ఈ రోజే ఏర్పడబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ఈ యోగాలకి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాగే ఏప్రిల్ 9వ తేదీ రోజున రేవతి అశ్విని నక్షత్రాలు కూడా ప్రత్యేక స్థానాల్లో ఉండబోతున్నారు. ఇలా ప్రత్యేక యోగాలు ఏర్పడడం, నక్షత్రాలు శుభస్థానంలో ఉండడం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ ఉగాది పండగ నుంచి ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభం రాశి:
ఈ ఉగాది పండగ వృషభ రాశి వారికి చాలా శుభ్రంగా ఉంది. ముఖ్యంగా వీరికి ఉద్యోగ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారం అవ్వబోతున్నాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. అంతేకాకుండా ఎప్పటినుంచి ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఈ సమయంలో పెద్ద కంపెనీలో నుంచి ఆఫర్లు లభిస్తాయి. ఎలాంటి పనులు చేసిన ప్రశంసలతో పాటు జీతాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. అలాగే వృషభ రాశి వారికి పదోన్నతులు కూడా లభిస్తాయి. ఇవే కాకుండా ఆర్థికంగా కూడా ఊహించని లాభాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా అప్పులు చేసిన వారు ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. దీనికి కారణంగా అప్పులన్నీ తీరుతాయి. అలాగే ప్రత్యేక యోగాలు ఏర్పడడం కారణంగా కుటుంబంలో ధన ప్రవాహం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మిథునం రాశి:
మిధున రాశి వారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రత్యేక యోగాల కారణంగా వీరికి ఆస్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు వీరు కొన్ని కొత్త ఆస్తులను కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే కొత్త కొత్త వాహనాలు కూడా ఈ సమయంలో కొనుగోలు చేస్తారు. వీరికి కాలం ఎంతో అనుకూలంగా ఉండబోతోంది వ్యాపారాలు చేస్తున్న వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు వ్యాపారాల్లో పెట్టుబడును పెట్టడం వల్ల విపరీతమైన డబ్బును పొందుతారు.
ధనుస్సు రాశి:
ధనస్సు రాశి వారికి కూడా ఉగాది రోజు ఏర్పడబోయే ప్రత్యేక యోగాల ప్రభావం ఎంతో ఆనందంతో పాటు లాభాలను అందించబోతోంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఏ పని చేసినా లాభాలు పొందడమే కాకుండా ఎంతో ఉత్సాహంగా పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక రంగంలో కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో వీరికి ఖర్చులు తగ్గడం వల్ల అనేక రకాల ఫలితాలు పొందుతారు. ధైర్యం ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి పనులైన చాలా తేలికగా చేయగలుగుతారు. ఎప్పటినుంచో సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఈ సమయంలో పరిష్కారం పొందుతారు. దీంతోపాటు లాభాలు పెరిగి ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి