Varalakshmi Vratham 2022: హిందూమతంలో శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతానికి అత్యంత మహత్యముంది. భక్తిశ్రద్ధలతో పూజిస్తే అనుకున్నవన్నీ నెరవేరుతాయని ప్రతీతి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. అవేంటో తెలుసుకుందాం..
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందురోజు శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఉంటుంది. ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం రేపు అంటే ఆగస్టు 5వ తేదీన ఉంది. ఈ సందర్బంగా లక్ష్మీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోర్కెలన్నీ నెరవేరుతాయని నమ్మకం. సకల సంపదలు లభిస్తాయని..మహిళలు ముత్తయిదువులుగా జీవిస్తారని విశ్వసిస్తారు. అందుకే ఉదయం లేచిన వెంటనే అభ్యంగన స్నానం చేసి ముగ్గులు వేసి..కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైన పిడివంటలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రత్యేక పూజలతో వ్రతాన్ని ఆచరిస్తారు.
వరలక్ష్మీ వ్రతం నాడు చేయకూడని పొరపాట్లు
శ్రావణమాసం రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. రెండవ శుక్రవారం సాధ్యం కానిపక్షంలో మిగిలిన శుక్రవారాల్లో కూడా ఆచరించే వీలుంది. వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత నిష్టతో చేయాలి. ఏమాత్రం పొరపాట్లు చేసినా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావల్సి వస్తుంది. అష్టకష్టాలు పడాలి. వరలక్ష్మీ వ్రతం నాడు ఏర్పాటు చేసే కలశాన్ని వెండి లేదా రాగి ప్లేట్లలో మాత్రమే ఉంచాలి. ముందుగా పసుపు గణపతి పూజ చేసిన తరువాతే..లక్ష్మీదేవి పూజ చేయాలి. గణపతి పూజ చేయకుండా లక్ష్మీదేవి పూజ చేయకూడదు.
వరలక్ష్మీ వ్రతం చేసుకునే సమయంలో ఇంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఏ ఒక్కరూ మిస్ కాకూడదు. లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. అందరూ కలసికట్టుగా పూజలు అత్యంత నిష్ఠతో చేయాలి. తాహతును బట్టి పూర్తి భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి. మనసులో భక్తి లేకుండా పేరుకు పూజలు చేయకూడదు.
Also read: Kitchen Vastu Tips: రాహుకేతువులతో మీ ఇంట్లో కిచెన్‌కు ఉండే సంబంధమేంటి, ఆ రెండు పాత్రలు, నియమాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Varalakshmi Vratham 2022: వరలక్ష్మి వ్రతం ఆగస్టు 5న ఏ పొరపాట్లు అస్సలు చేయకూడదు, ఏం