Vasant Panchami 2023: వసంత పంచమి మాఘమాసంలో ఇదే రోజున జరుపుకుంటారు. అయితే ఈ సారి జనవరి 26న (ఈ రోజు) జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఈ రోజు అందరూ సర్వతిని దేవిని పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజునుంచే పెళ్లిలకు సంబంధించి శుభ ముహూర్తాలు కూడా మొదలదవుతాయి. ఈ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జీవితంలో పలు సమస్యలతో బాధపడేవారు ఈ రోజు ఉపవాసాలు పాటించి..భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం లభించి మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం. అయితే ఈ రోజూ ఏ సమయాల్లో పూజలు చేయడం వల్ల మంచి జరిగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
వసంత పంచమి జనవరి 25 మధ్యాహ్నం 12:34 గంటలకే ప్రారంభమైంది. అయితే శుభ గడియలు జనవరి 26 ఉదయం 10:28 వరకు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయాల్లో అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల జీవితంలో విద్యతో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని నమ్మకం.
సరస్వతి దేవిని ఈ రోజు ఎలా పూజించాలో తెలుసా?:
వసంత పంచమి విజ్ఞానం, సంగీతం, కళ, విజ్ఞానానికి తల్లైనా సరస్వతి పూజించే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి పసుపు వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సరస్వతి ప్రతిమకు అభిషేకం చేయాలి. ఇలా చేసిన తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు చీరతో అలంకరించాలి. సరస్వతి ఎంతో ఇష్టమైన స్వీట్లు నైవేద్యంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజులు నోములు చేసుకునేవారు తప్పకుండా సరస్వతి పూజలో మామిడి ఆకులు, కుంకుమ, పసుపు, అక్షత, తిలకం, కలశం, సరస్వతి యంత్రం, దుర్వ గడ్డి భాగం చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: IPS Transfers: ఒకే దెబ్బకు తెలంగాణలో 91 మంది ఐపీఎస్‌ల బదిలీ.. అందుకేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook