Betel Leaf Remedy in Telugu: రాత్రి పడుకునే ముందు మన మనస్సు ప్రశాంతంగా ఉండదు. దీంతో ఏవేవో కలలు వస్తాయి. అంతేకాదు పగలు జరిగిన సంఘటనలు పదేపదే గుర్తుచేసుకుంటూ నిద్ర లేమి ఏర్పడుతుంది. ఫలితంగా మనల్ని అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అయితే, జోతిష్యం ప్రకారం కొన్ని పరిహారాలతో నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు. అంతేకాదు దీనివల్ల మన వృత్తివ్యాపారాల్లో లాభాలు చేకూరతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సులో పాజిటివిటీ పెరుగుతుంది. జాతకంలో గ్రహాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే గ్రహాలు పడటానికి ఎన్నో ఉపాయాలు చేస్తాం. పూజలు పరిహారాలు కూడా నిర్వహిస్తాం. ముఖ్యంగా మన జాతకంలోని గ్రహాల వల్లే పెళ్లి, ఉద్యోగం, ఇళ్లు నిర్మాణాలు కూడా ఆధారపడతాయి. ప్రతి గ్రహం మన జీవితంలో ఏదో ఒక సంఘటనతో ముడిపడి ఉంటుంది. ఈరోజు మనం బుధగ్రహం గురించి తెలుసుకుందాం. జాతకంలో బుధగ్రహం బలపడటానికి చర్యలు చేస్తే తెలివి తేటలు పెరిగి వృత్తి వ్యాపారంలో విజయం సాధిస్తాం.
తమలపాకు మన ఇళ్లలో జరిగే ప్రతి శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. హిందూ సంప్రదాయంలో తమలపాకు లేనిదే ఏ పూజ జరగదు. తమలపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా తమలపాకు బుధ గ్రహానికి సంబంధించింది. జోతిష్యం ప్రకారం అన్నీ గ్రహాలు ఏదో ఒక భాగానికి సంబంధించింది. బుధగ్రహం కూడా మన భుజం, మెడ, చర్మానికి సంబంధించింది. మన జాతకంలో బుధగ్రహం బాగుంటే తెలివితేటలు పదునుగా ఉంటాయి. బుధుడు తెలివితేటలకు కారణం. ఈ గ్రహం బాగుంటే వృత్తివ్యాపారాల్లో విజయం వరిస్తుంది. ఈరోజు తమలపాకును మన దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
ఇదీ చదవండి: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ ప్రత్యేక పూజలు..
జోతిష్యం ప్రకారం తమలపాకును దిండు కింద పెట్టుకుని పడుకుంటే మానసిక ప్రశాంతత పొందుతారు. దీంతో తీవ్ర ఒత్తిడిల నుంచి కూడా బయటపడొచ్చు. బుధుడితో కలిసిన గ్రహాలన్ని కూడా మనకు శుభాన్ని ఇస్తాయి. ఇలా చేయడం వల్ల మనస్సు రిలాక్స్ గా కూడా ఉంటుంది. సరిగ్గా నిద్రపడుతుంది. ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయి. బుధ గ్రహం జాతకంలో బలంగా ఉంటే మనస్సులో సానుకూలత ఏర్పడుతుంది.
ఇదీ చదవండి: వచ్చే నెలలో సంపూర్ణ సూర్యగ్రహణం.. మన దేశంపై ప్రభావం ఉంటుందా?
రాత్రి పడుకునే ముందు దిండు కింద తమలపాకును పెట్టుకునే ముందు ఆకును గంగాజలం లేదా తులసి నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత దాన్ని ఓ ఎర్రటి గుడ్డలో చుట్టి దిండు కింద పెట్టుకుని పడుకోవాలి. ఈ రెమిడీ ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి