Anushka Sharma posts Emotional note over Virat Kohli steps down as India Test Captain: భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli) వైదొలిగాడు. దీంతో అన్ని ఫార్మాట్ల సారథ్యం నుంచి కోహ్లీ తప్పుకొన్నట్లే. మూడు నెలల్లో అన్ని ఫార్మాట్ల సారథ్యంకు కోహ్లీ వీడ్కోలు పలకడం ఇప్పుడు పెద్ద సంచలంగా మారింది. ఏదేమైనా కోహ్లీ నిర్ణయంపై మాజీలు సహా క్రీడా ప్రపంచం స్పందిస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జై షా, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఓపెనర్ రోహిత్ శర్మ తదితరులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. తాజాగా కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma) కూడా ఈ జాబితాలో చేరారు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన కోహ్లీపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా సుధీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
'2014లో టెస్టు క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాలని ఎంఎస్ ధోనీ (MS Dhoni) నిర్ణయించుకున్నందునే నిన్ను కెప్టెన్‌గా చేశారని నువ్వు చెప్పిన రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు తర్వాత ఎంఎస్, నువ్, నేను చాట్ చేసుకోవడం నాకు గుర్తుంది. నీ గడ్డం ఎంత త్వరగా నెరిసిపోతుందో అని అతను సరదాగా చెప్పాడు. దాని గురించి మనం బాగా నవ్వుకున్నాం. ఆ రోజు నుంచి నేను నీ గడ్డం నెరసిపోకుండా చాలా ప్రయతించాను. నేను మీలో అపారమైన అభివృద్ధిని చూశాను. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నీ ఎదుగుదల, నీ నాయకత్వంలో జట్టు సాధించిన విజయాల గురించి నేను చాలా గర్వపడుతున్నా' అని అనుష్క శర్మ ట్వీట్ చేశారు.
'2014లో మనం యవ్వనంగా మరియు అమాయకంగా ఉన్నాము. మంచి ఉద్దేశాలు, సానుకూల ప్రేరణ జీవితంలో ముందుకు తీసుకెళ్లగలవని అనుకున్నాం. నువ్ ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లు మైదానంలో మాత్రమే లేవు. ఇది జీవితం. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు పోవాల్సిందే. ఇక నాపై ఉన్న ప్రేమకు చాలా గర్వపడుతున్నా. ఇంకా ఏదైనా చేయగలరా అని ఆలోచిస్తున్నావు. ఇదే ప్రతి ఒక్కరి నుండి నువ్ ఆశించేది. నీది కల్తీ లేని మనసు. ప్రతి ఒక్కరూ నిన్ను అర్థం చేసుకోలేరు. నువ్ తీసుకున్న నిర్ణయం సరైనదే. నువ్, నా ప్రేమ అపరిమితం. ఈ ఏడేళ్లుగా తన తండ్రి నేర్చుకోవడాన్ని మన కుమార్తె చూస్తుంది' అని అనుష్క శర్మ (Anushka Sharma Emotional Note) పేర్కొన్నారు.
Also Read: Baahubali Thali Prize Money: ఈ బాహుబలి మీల్స్ తింటే.. రూ 8 లక్షల ప్రైజ్ మనీ మీ సొంతం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook