AUS VS PAK: 'కెప్టెన్ కమ్ థోర్.. కమ్ కమిన్స్'.. ఆసీస్ సారథిపై ట్రోల్స్..

ఆసీస్ సారథి పాట్ కమిన్స్ క్రీజులోకి వచ్చి సుత్తితో పిచ్‌ను తయారు చేయడంతో పాకిస్థాన్ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 03:27 PM IST
  • ఆసీస్ - పాక్ టెస్ట్ మ్యాచ్ లో ఆసక్తికర సన్నివేశం
  • సుత్తితో పిచ్‌ను కొట్టిన ఆసీస్ సారథి పాట్ కమిన్స్
  • నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియో
AUS VS PAK: 'కెప్టెన్ కమ్ థోర్.. కమ్ కమిన్స్'.. ఆసీస్ సారథిపై ట్రోల్స్..

Australia Vs Pakistan: ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆసీస్ సారథి పాట్ కమిన్స్ క్రీజులోకి వచ్చి సుత్తితో పిచ్‌ను తయారు చేయడం సోషల్ మీయాలో చక్కర్లు కొడుతోంది. 

పాకిస్తాన్‌తో జరుగుతున్న ఇన్నింగ్స్‌లో 53వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రీన్ బౌలింగ్ చేయడానికి కామెరాన్ రెడీ అయ్యాడు. బాల్ విసిరే టైంలో ల్యాండింగ్ ఏరియా గట్టిగా ఉండడంతో గ్రీన్‌ ఇబ్బందిగా భావించడంతో.. గ్రౌండ్‌మన్ అవతారం ఎత్తి సుత్తితె మట్టిని కొట్టారు ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్.

తన బలాన్ని ఉపయోగించి బౌలర్‌కు బాల్ ల్యాండింగ్ సుగమమయ్యేందుకు మట్టిని తీసివేశాడు ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్. ఇదంతా మ్యాచ్‌లో ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇది గమనించిన పీసీబీ కమిన్స్‌ను నయా థోర్ అంటూ కామెంట్ చేసింది. 

సోషల్ మీడియాలో ఇది చూసిన పాకిస్తాన్ అభిమానులు కమిన్స్‌ను అవహేళన చేశారు. "మార్వెల్ సినిమాలో నటిస్తావా".. "థోర్ కంటే నువ్వే బాగున్నావు" అంటూ "కెప్టెన్ కమ్ థోర్.. కమ్ కమిన్స్" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Aslo Read: Navjot Singh Sidhu: సోనియా ఆదేశాలతో పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడిగా తప్పుకున్న సిద్ధూ

Aslo Read: Inter Exams 2022: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో మార్పు.. ఏ ఎగ్జామ్ ఎప్పుడో తెలుసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News