England vs New Zealand: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. జూలై 1న జరిగే మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడా అన్న దానిపై క్లారిటీ లేదు. దీంతో భారత్‌కు భారీ షాక్ తగినట్లు అయ్యింది. తాజాగా ఇంగ్లండ్ ఆటగాడు, వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌కు వైరస్ సోకింది.
ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) అధికారికంగా ప్రకటించింది. దీంతో అతడు న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఫోక్స్‌కు నడుము నొప్పితోపాటు కరోనా లక్షణాలు ఉన్నట్లు ఈసీబీ తెలిపింది. వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు వెల్లడించింది.
ప్రస్తుతం ఇంగ్లండ్ ఆటగాడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడి స్థానంలో సామ్ బిల్లింగ్స్‌ను ఎంపిక చేసినట్లు ఈసీబీ ప్రకటించింది. అతడు నాలుగో రోజు ఆటలో పాల్గొంటాడని తెలిపింది. జూలై 1 నుంచి టీమిండియాతో జరగబోయే మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తాడని పేర్కొంది. మరోవైపు ఇంగ్లండ్‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజుకు రోజుకు కొత్త కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
Get well soon, Foakesy 🙏
Welcome to the group, Bilbo 👋
🏴 #ENGvNZ 🇳🇿
— England Cricket (@englandcricket) June 26, 2022
Also read: Bandi Sanjay: ఒక్క ఛాన్స్ ఇవ్వండి..తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ పిలుపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.