India vs South Africa T20 and ODI Schedule, Live Streaming Details: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత్ మరో సమరానికి సిద్దమవుతోంది. దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం (సెప్టెంబరు 28) నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఆపై వన్డే సిరీస్ (అక్టోబరు 6) జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2022కి ముందు జరగనున్న ఈ పర్యటనకు సద్వినియోగం చేసుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. సరైన బ్యాటింగ్, బౌలింగ్ కూర్పును తయారుచేసుకునేందుకు టీమిండియాకు ఇదే మంచి సమయం.
టీ20, వన్డే సిరీస్ కోసం ఇప్పటికే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాతో మూడో టీ20 ఆడిన భారత్ కూడా హైదరాబాద్ నుంచి నేరుగా మొదటి టీ20 జరిగే తిరువనంతపురం చేరుకున్నారు. ఈ ఏడాది భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సిరీస్ జరగడం ఇది మూడోసారి. జనవరిలో దక్షిణాఫ్రికాకు భారత్ వెళ్లగా.. జూన్‌లో భారత్‌కు దక్షిణాఫ్రికా వచ్చింది. ఇప్పుడు మరోసారి భారత్‌కు దక్షిణాఫ్రికా వచ్చింది. తాజా సిరీస్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఓసారి చూద్దాం.
టీ20 సిరీస్ షెడ్యూల్:
# మొదటి టీ20: సెప్టెంబరు 28 - గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం - తిరువనంతపురం
# రెండో టీ20: అక్టోబరు 2 - బర్సపర క్రికెట్ స్టేడియం - గువాహటి
# మూడో టీ20: అక్టోబరు 4 - హోల్కర్ క్రికెట్ స్టేడియం - ఇండోర్
వన్డే సిరీస్ షెడ్యూల్:
# తొలి వన్డే: అక్టోబరు 6 - అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియం - లక్నో
# రెండో వన్డే: అక్టోబరు 9 - జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ - రాంచి
# మూడో వన్డే: అక్టోబరు 11 - అరుణ్ జైట్లీ స్టేడియం - ఢిల్లీ
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే అన్ని టీ20 మ్యాచ్‌లు రాత్రి ఏడు గంటలకు ఆరంభం అవుతాయి. మరోవైపు అన్ని వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆరంభం కానున్నాయి. ఇక టీ20, వన్డే మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
Also Read: భారత మహిళా క్రికెటర్ తానియా భాటియాకు చేదు అనుభవం.. అగంతకుడు రూమ్‌లోకి దూరి..!
Also Read: Faria Abdullah in SSMB28: మహేష్ బాబుతో చిట్టి.. అసలు క్లారిటీ వచ్చేసిందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook