India Won by 10 Wickets Against Sri Lanka in Asia Cup 2023: ప్రపంచకప్‌కు ముందు టీమిండియా పెద్ద బూస్ట్. ఆసియాకప్‌లో చరిత్ర సృష్టించింది. ఫైనల్ పోరులో శ్రీలంకను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి.. ఎనిమిదోసారి ఆసియాకప్‌ను ముద్దాడింది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ ఫైట్‌లో మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. దీంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. అనంతరం భారత్ కేవలం 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించే.. రికార్డు స్థాయి విక్టరీని సొంతం చేసుకుంది. ఎనిమిది సార్లు ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుని భారత్ చరిత్ర సృష్టించింది. అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకున్న జట్టుగా తన రికార్డును మరింత పదిలం చేసుకుంది. శ్రీలంక ఆరు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు ఆసియా కప్‌ను గెలుచుకున్నాయి.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకను తొలి ఓవర్‌లోనే బుమ్రా దెబ్బ తీశాడు. ఓపెనర్ కుశాల్ పెరీరాను డకౌట్ చేశాడు. ఆ తరువాత మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో లంకేయులను క్రీజ్‌లో నిలబడనివ్వలేదు. నాలుగో ఓవర్లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. సిరాజ్ దెబ్బకు శ్రీలంక 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌కు తోడు హర్థిక్ పాండ్యా కూడా మూడు వికెట్లు పడగొట్టి.. శ్రీలంక టెయిలండర్లను పెవిలియన్ బాటపట్టించాడు. శ్రీలంక జట్టు కేవలం 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. భారత్‌పై ప్రత్యర్థి జట్టులో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. సిరాజ్ 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు.
టీమిండియా బౌలర్ల ధాటికి 9 మంది శ్రీలంక ఆటగాళ్లు రెండంకెల స్కోరును దాటలేకపోయారు. ఐదుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13) రెండంకెల స్కోరును దాటారు. అనంతరం ఇషాన్ కిషన్ (23), శుభ్‌మన్ గిల్ (27) రాణించడంతో ఒక వికెట్ కూడా కోల్పోకుండా 6.1 ఓవర్లలో భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. తక్కువ లక్ష్యం కావడంతో రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనింగ్‌కు వచ్చాడు.
Also Read: Ghaziabad Man Death: షాకింగ్ ఘటన.. ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ యువకుడు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook