ICC World Test Championship: వెస్టిండీస్ టూర్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. రోసోలోని విండ్సర్ పార్క్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అంతేకాకుండా డబ్ల్యూటీసీ 2023 పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా జట్టు రెండో స్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ మూడోస్థానంలో ఉంది.
ఈ విజయంతో రోహిత్ శర్మ సేన ఖాతాలో 12 డబ్ల్యూటీసీ పాయింట్లు చేరాయి. గెలుపు శాతం 100 శాతం. 3 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా 22 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆసీస్.. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇప్పటివరకు కేవలం ఒక టెస్టు గెలిచి 10 పాయింట్లు సాధించిన ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాలో 61.11 శాతం కాగా.. ఇంగ్లాండ్ గెలుపు శాతం 27.78గా ఉంది. విండీస్ చివరి స్థానంలో ఉండగా.. మిగిలిన జట్లు డబ్ల్యూటీసీ ప్రయాణం ఇంకా ప్రారంభించలేదు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక వంటి జట్లు ఇంకా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మ్యాచ్‌లు ఆడలేదు.
ప్రస్తుత డబ్ల్యూటీసీ సర్కిల్ జూన్ 2023 నుంచి జూన్ 2025 వరకు నడుస్తుంది. మొదటి తొమ్మిది టెస్ట్ జట్లు.. ఒక్కొక్కటి ఆరు సిరీస్‌లు ఆడతాయి. ఇందులో మూడు స్వదేశంలో, మూడు విదేశాల్లో జరగుతాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి. మొదటి డబ్ల్యూటీసీ ట్రోఫీని న్యూజిలాండ్ సొంతం చేసుకోగా.. రెండో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేరినా.. టీమిండియాకు నిరాశే ఎదురైంది.
వెస్టిండీస్‌పై టెస్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. జైస్వాల్ (171, 387 బంతుల్లో; 16 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించి తొలి మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (103) శతకం బాదగా.. విరాట్ కోహ్లీ (76) అర్ధ సెంచరీ చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లతో సత్తాచాటాడు. ఈ నెల 20వ తేదీ నుంచి రెండో టెస్ట్ ప్రారంభంకానుంది.
Also Read: 7th Pay Commission DA Hike: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంచుతూ నిర్ణయం
Also Read: Gas Bill Offers 2023: గ్యాస్ బిల్లుల చెల్లింపులపై బంపర్ ఆఫర్స్.. ఈ ప్రోమో కోడ్‌లను వాడుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి