India vs England 2nd T20I Preview, Playing XI: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచులో అద్భుత విజయం సాధించిన భారత్.. రెండో టీ20కి సిద్దమైంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య బర్మింగ్‌హామ్ వేదికగా శనివారం (జులై 9) రాత్రి 7.30 గంటలకు రెండో టీ20 ఆరంభం కానుంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ పట్టాలని టీమిండియా చూస్తోంది. మరోవైపు తొలి టీ20 పరాజయానికి ప్రతీకారం తీర్చుకొని.. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే టీమిండియా తుది జట్టును ఎంచుకోవడం టీం మేనేజ్మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
టెస్ట్ ఆడిన ప్లేయర్స్ రెండో టీ20 మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చారు. దాంతో విన్నింగ్ కాంబినేషన్‌లోనిఎవరిని పక్కనపెడుతారనే అంశం చర్చనీయాంశమైంది. స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాల రాకతో ఫామ్ ఆటగాళ్లపై వేటుపడే అవకాశాలు ఉన్నాయి. ఇషాన్ కిషన్ తొలి టీ20లో విఫలమైన నేపథ్యంలో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఫామ్‌లో ఉన్న దీపక్ హుడా తుది జట్టులో ఉండాలంటే కోహ్లీ ఓపెనింగ్ చేయక తప్పదు. ఒకవేళ ఇషాన్ ఆడితే.. హుడాకు చోటుండదు.
మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. దాంతో హిట్టర్ దినేశ్ కార్తీక్‌పై వేటు పడనుంది. అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా జట్టులోకి రానున్నాడు. ఒకవేళ డీకేను ఆడించాలనుకుంటే జడేజాపై వేటు పడుతుంది. జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి రానుండడంతో హర్షల్ పటేల్‌పై వేటు పడుతుంది. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చహల్ జట్టులో ఖాయం.
తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్/రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్.
డ్రీమ్ 11 టీమ్:
జోస్ బట్లర్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), యుజ్వేంద్ర చహల్, హర్షల్ పటేల్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్.
Also Read: Shinzo Abe Death: జపాన్ మాజీ ప్రధానిని అందుకే చంపా.. సంచనల విషయం చెప్పిన షూటర్!
Also Read: 30 నిమిషాల్లో ఈ సమోసా తింటే.. రూ. 51 వేలు మీవే! ట్రై చేయండి మరి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook