IPL 2021: సీఎస్కే జట్టు ఆ తప్పిదం రిపీట్ చేస్తే MS Dhoniపై వేటు తప్పదు, కారణమిదే

Ban On MS Dhoni | భారత్‌కు టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ అందించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరువాత రెండు మ్యాచ్‌లలో చిన్న తప్పిదం మరోసారి రిపీట్ చేశాడంటే రెండు నుంచి 4 మ్యాచ్‌ల వరకు అతడిపై నిషేధం పడనుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 16, 2021, 09:04 AM IST
IPL 2021: సీఎస్కే జట్టు ఆ తప్పిదం రిపీట్ చేస్తే MS Dhoniపై వేటు తప్పదు, కారణమిదే

IPL 2021: టీమిండియాకు అపూర్వ విజయాలు అందించిన కెప్టెన్ ఎంఎస్ ధోనీ. జట్టుకు టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ అందించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ కొనసాగుతున్నాడు.

నేడు ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(CSK), పంజాబ్ కింగ్స్‌తో తమ రెండో మ్యాచ్‌లో తలపడనుంది. అయితే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరువాత రెండు మ్యాచ్‌లలో చిన్న తప్పిదం మరోసారి రిపీట్ చేశాడంటే రెండు నుంచి 4 మ్యాచ్‌ల వరకు అతడిపై నిషేధం పడనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నియమావళి ప్రకారం ఏదైనా జట్టు 90 నిమిషాల వ్యవధిలో 20 ఓవర్ల బౌలింగ్ కోటాను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా సీఎస్కే కెప్టెన్ ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించారు.

Also Read: Ashish Nehra: అది మార్చుకోకపోతే టీమిండియాలోకి Manish Pandey కష్టమే

ఒకవేళ చెన్నై జట్టు ఇదే తప్పిదాన్ని తరువాతి రెండో మ్యాచ్‌లలో మరోసారి చేసిందంటే కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీపై కనీసం రెండు మ్యాచ్‌లు గరిష్టంగా 4 మ్యాచ్‌ల వరకు నిషేధం విధిస్తారు. దీనిపై మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకుంటాడు. దాంతో నేడు ముంబైలోని వాంఖేడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ బౌలింగ్ కోటాపై ఫోకస్ చేయనున్నాడు. లేనిపక్షంలో సీఎస్కే జట్టు ధోనీ సేవలు తాత్కాలికంగా కోల్పోయి మూల్యం చెల్లించుకోనుంది. 

మరోవైపు గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన చెన్నై జట్టు ఈ సీజన్‌లో మంచి ఫలితాలు రాబట్టాలని భావిస్తోంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్కె కెప్టెన్ ఎంఎస్ ధోనీ డకౌట్ అయ్యాడు. డీసీ పేసర్ అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండా ఔటై పెవిలియన్ బా పట్టాడు. ఆ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.

Also Read: MS Dhoni Fined: ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లో ఓడిన CSK కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జరిమానా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News