IPL 2024, KKR vs RCB Live Updates: ఈ సీజన్ లో ఆర్సీబీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరింటిలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కోహ్లీ, డుప్లెసిస్, సిరాజ్ వంటి ఆటగాళ్లు ఉన్న ఆ జట్టుకు విజయాలు అందించలేకపోతున్నారు. ఈ క్రమంలో మరో పోరుకు సిద్ధమైంది ఆర్సీబీ జట్టు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి కేకేఆర్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. సాల్ట్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కేవలం 14 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివరి బ్యాటర్లు కూడా బ్యాట్ ఝలిపించడంతో కేకేఆర్ భారీ స్కోరు చేసింది. యశ్ దయాల్, గ్రీన్ చెరో రెండు వికెట్లు తీశారు.
అయితే ఈ మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గ్రీన్ పట్టిన ఓ స్టన్నింగ్ క్యాచ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. యశ్ దయాల్ బౌలింగ్ లో అంగ్క్రిష్ రఘువంశీ లెగ్ సైడ్‌లో అద్భుతమైన ఫ్లిక్ షాట్ కొట్టాడు. కానీ కామెరాన్ గ్రీన్ సర్కిల్ లోపల నిలబడి, అతని హైట్ ను ఉపయోగించుకుని కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఆ క్యాచ్ చూసి కోహ్లీ సైతం షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట ట్రెండింగ్ లో ఉంది. రఘవంశీ చాలా డేంజరస్ బ్యాటర్. ఢిల్లీతో మ్యాచ్ లో 54 పరుగులు, చెన్నైపై 24, లక్నోపై 7, రాజస్థాన్‌పై 30 పరుగుల వంటి విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. తాజా మ్యాచ్ లో ఆర్సీబీ గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగింది.
Also Read: IPL Jio Data Plans: ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు డేటా సరిపోవడం లేదా, టాప్ 5 జియో డేటా ప్లాన్స్ ఇవే
కేకేఆర్ తుది జట్టు : ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, ఆండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా.
ఆర్సీబీ తుది జట్టు : ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తిక్, మహిపాల్ లొమ్రోర్, కరన్ శర్మ, ఫెర్గూసన్, యశ్ దయాల్, సిరాజ్.
Nothing gets past the Green machine! 🤯#KKRvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/Ot6qatYtG8
— JioCinema (@JioCinema) April 21, 2024
Also read: DC vs SRH Highlights: సన్‌రైజర్స్ మరో సంచలన విజయం.. ఢిల్లీని మడతబెట్టిన నటరాజన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter