SRH Vs MI: థ్రిల్లింగ్ ఫైట్‌లో ముంబైపై హైదరాబాద్ గెలుపు.. మ్యాచ్‌ను మలుపు తిప్పిన భువీ.. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం..

IPL Latest Updates: ఐపీఎల్‌లో ఇవాళ ముంబై-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ థ్రిల్లింగ్‌గా సాగింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 12:41 AM IST
  • ఐపీఎల్ లేటెస్ట్ అప్‌డేట్స్
  • ముంబై-హైదరాబాద్ జట్ల మధ్య థ్రిల్లింగ్ ఫైట్
  • ముంబైపై 3 పరుగుల తేడాతో హైదరాబాద్ విక్టరీ
  • మ్యాచ్‌ను మలుపు తిప్పిన భువీ
SRH Vs MI: థ్రిల్లింగ్ ఫైట్‌లో ముంబైపై హైదరాబాద్ గెలుపు.. మ్యాచ్‌ను మలుపు తిప్పిన భువీ.. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం..

IPL Latest Updates: ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ ముంబై-హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో విజయం సన్‌రైజర్స్‌నే వరించింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 3 పరుగుల తేడాతో ముంబైపై విక్టరీ కొట్టింది. ముంబై బ్యాట్స్‌మెన్ టిమ్ డేవిడ్ రనౌట్, సన్ రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన 19వ ఓవర్ మ్యాచ్‌కి టర్నింగ్ పాయింట్స్‌గా నిలిచాయి.

మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 76 (44),ప్రియం గార్గ్ 42 (26), పూరణ్ 38 (22) పరుగులతో రాణించారు. 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అద్భుతమైన శుభారంభం ఇచ్చారు. రోహిత్ 4 సిక్సులు, 2 ఫోర్లతో 48 (36), ఇషాన్ కిషన్  5 ఫోర్లు, 1 సిక్సుతో 43 (34) పరుగులు బాదారు. 95 పరుగుల వద్ద రోహిత్ ఔట్ అవడంతో ఈ ఇద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. 

అప్పటిదాకా ముంబై వైపు ఉందనుకున్న మ్యాచ్ ఆ తర్వాత హైదరాబాద్ వైపు టర్న్ తీసుకుంది. 18వ ఓవర్‌లో టిమ్ డేవిడ్ మెరుపులతో ముంబైలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఆ ఓవర్‌లో టిమ్ డేవిడ్ నాలుగు సిక్సులు బాదడంతో మ్యాచ్‌పై మళ్లీ ముంబై పట్టు సాధిస్తున్నట్లే కనిపించింది. కానీ అదే ఓవర్‌లో డేవిడ్ ఔట్ రనౌట్ అవడంతో ముంబై మెరుపులకు తెరపడింది.

ఆ తర్వాత భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్ మ్యాచ్‌ను ముంబైకి దూరం చేసింది. రెండు ఓవర్లలో ముంబై విజయానికి 19 పరుగులు అవసరమైన దశలో భువీ మెయిడిన్ ఓవర్ వేయడమే గాక వికెట్ తీశాడు. 19వ ఓవర్ రెండో బంతికి సంజయ్‌ని పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బుమ్రా.. భువీ వేసిన నాలుగు యార్కర్లలో ఒక్క బంతికి కూడా కనీసం ఒక్క పరుగు రాబట్టలేకపోయాడు. దీంతో చివరి ఓవర్‌లో ముంబై విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. ఫరూఖీ వేసిన ఆ ఓవర్‌లో కేవలం 15 పరుగులే రావడంతో ముంబై 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. ఈ విజయంతో టెక్నికల్‌గా చూస్తే హైదరాబాద్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నప్పటికీ... టాప్ 4లో చోటు దక్కడం కష్టమనే చెప్పాలి. 

 

Also Read: Best Zodiac Signs To Marry: ఈ రాశుల వారిని జీవిత భాగస్వామిగా పొందితే... అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు... 

Also Read: North Korea Corona: ఉత్తర కొరియాలో మాయదారి వైరస్ విజృంభణ..వణికిపోతున్న ప్రజలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News