CSK vs KKR IPL 2023 Playing 11 Out: ఆదివారం డబుల్ హెడ్డర్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచులో టాస్ నెగ్గిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేయలేదని మహీ చెప్పాడు. మరోవైపు ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నామని కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా తెలిపాడు. అనుకుల్ రాయ్ స్థానంలో వైభవ్ అరోరా తుది జట్టులోకి వచ్చాడు.
ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. అయినప్పటికీ ప్రత్యర్థి చెన్నైకి గట్టి పోటీనివ్వాలని చూస్తోంది. పాయింట్ల పట్టికలో కోల్‌కతా తన స్థానం దిగజారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచులో చెన్నై ఫెవరెట్ అని చెప్పొచ్చు.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: రెహ్మనుల్లా గుర్భాజ్, జేసన్ రాయ్, నితీశ్ రాణా (కెప్టెన్), ఆండ్రూ రస్సెల్, రింకు సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, అజింక్య రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబె, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎం ఎస్ ధోనీ (కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌లు:
చెన్నై సూపర్ కింగ్స్: మతీశా పతిరాణ, నిషాంత్ సింధు, సేనాపతి, షేక్ రషీద్, ఆకాశ్ సింగ్.
కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేశ్ అయ్యర్, అనుకుల్ రాయ్, జగదీశన్, ఉమేశ్ యాదవ్, ఫెర్గూసన్.
Also Read: RR vs RCB: 59 పరుగులకే రాజస్థాన్ ఆలౌట్.. 112 పరుగుల తేడాతో బెంగళూరు ఘన విజయం!
Also Read: Cheteshwar Pujara Vice Captain: టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఛతేశ్వర్ పుజారా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.