RR Beat CSK: ధోనీ, జడేజా పోరాడినా.. చెన్నైకి తప్పని ఓటమి!

Rajasthan Royals won by 3 runs vs Chennai Super Kings. బుధవారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 3 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్ విజయం సాధించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 15, 2023, 10:55 AM IST
  • ధోనీ, జడేజా పోరాడినా
  • చెన్నైకి తప్పని ఓటమి
  • చహల్, అశ్విన్‌ తలో రెండు వికెట్లు
RR Beat CSK: ధోనీ, జడేజా పోరాడినా.. చెన్నైకి తప్పని ఓటమి!

RR Beat CSK in IPL 2023: ఐపీఎల్ 2023లో రాజస్థాన్‌ రాయల్స్‌ మరో విజయం అందుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బుధవారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే (50; 38 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ బాదాడు. ఎంఎస్ ధోనీ (32; 17 బంతుల్లో 1 ఫోర్‌ 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (25; 15 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా తన జట్టును గెలిపించలేకపోయారు. రాజస్థాన్‌ బౌలర్లలో చహల్, అశ్విన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ (10) ఔట్ అయ్యాడు. డేవాన్ కాన్వే (50; 38 బంతుల్లో 6 ఫోర్లు), అజింక్య రహానె (31; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌)లు జట్టును ఆదుకున్నారు. కీలక సమయంలో రహానే, శివమ్‌ దూబే (8), మొయిన్‌ అలీ (7), అంబటి రాయుడు (1),  డేవాన్‌ కాన్వే (50) ఔట్‌ కావడంతో చెన్నై కష్టాల్లో పడింది. చివరి 4 ఓవర్లలో చెన్నై విజయానికి 59 పరుగులు అవసరం కాగా.. ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. దాంతో చెన్నై విజయం సాధిస్తుందనే ధీమా అభిమానుల్లో ఉంది. అయితే యుజ్వేంద్ర చహల్‌ వేసిన 17 ఓవర్లో ఐదు పరుగులే వచ్చాయి. దీంతో ఉత్కంఠ పెరిగింది. 

స్పిన్నర్ ఆడమ్‌ జంపా వేసిన 18వ ఓవర్లో ఎంఎస్ ధోనీ ఓ ఫోర్‌, సిక్స్‌ కొట్టాడు. దీంతో చెన్నై విజయ సమీకరణం 12 బంతుల్లో 40 పరుగులుగా మారింది. జాసన్ హోల్డర్‌ వేసిన 19 ఓవర్లో ఆర్ జడేజా రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌ బాదాడు. ఇక చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా.. సందీప్ శర్మ ఆదిలోనే రెండు వైడ్లు వచ్చాయి. రెండు, మూడు బంతులకు ధోనీ సిక్సర్లు బాదాడు. ఇక చివరి బంతికి 5 రన్స్‌ అవసరం కాగా.. ధోనీ ఒక పరుగే చేయగలిగాడు. దీంతో చెన్నైకి ఓటమి తప్పలేదు.

Also Read: Sandeepa Dhar Hot Pics: శారీలో సందీప ధార్.. వలపుల వయ్యారాలతో కుర్రాళ్ల మనసు దోచేస్తుందిగా!

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 175 రన్స్ చేసింది. జోస్‌ బట్లర్ (52; 36 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), దేవదత్‌ పడిక్కల్ (38; 26 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. రవిచంద్రన్ అశ్విన్‌ (30; 22 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), షిమ్రాన్ హెట్‌మయర్‌ (30; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో ఆకాశ్‌ సింగ్ 2, తుషార్‌ దేశ్‌పాండే 2, రవీంద్ర జడేజా 2 తలో రెండు వికెట్స్ పడగొట్టారు.

Also Read: Ileana DCruz Hot Pics: ఇలియానా డిక్రూజ్ హాట్ ట్రీట్.. ఇల్లు బేబీ అందాలు మామూలుగా లేవుగా! నెవర్ బిఫోర్ పిక్స్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News