Sunrisers Hyderabad opt to bowl vs Mumbai Indians: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముంబై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని మార్క్రమ్ తెలిపాడు. ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నామని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. స్టార్ పేసర్ జాసన్ బెహ్రెండోర్ఫ్ జట్టులోకి వచాడు.
ఐపీఎల్ టోర్నీలో హైదరాబాద్, ముంబై జట్లు 19 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై 10 మ్యాచులలో విజయం సాధించగా.. హైదరాబాద్ 9 మ్యాచుల్లో గెలిచింది. హైదరాబాద్ అత్యధిక స్కోరు 193 పరుగులు కాగా.. ముంబై అత్యధిక స్కోరు 235. ఎస్ఆర్హెచ్ అత్యల్ప స్కోరు 96 రన్స్ కాగా.. ముంబై అత్యల్ప స్కోర్ 87. ఐపీఎల్ 2023లో ముంబై, హైదరాబాద్ తలపడడం ఇదే తొలిసారి.
తుది జట్లు:
సన్‌రైజర్స్: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టీ నటరాజన్.
ముంబై: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, నేహల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జేసన్ బెహ్రన్‌డార్ఫ్.
A look at the Playing XIs for #SRHvMI
Live - https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/yZcFvVGOYB
— IndianPremierLeague (@IPL) April 18, 2023
సబ్స్టిట్యూట్లు:
ముంబా: రిలే మెరిడిత్, రమణ్‌దీప్ సింగ్, కుమార్ కార్తికేయ, షామ్స్ ములానీ, విష్ణు వినోద్.
సన్‌రైజర్స్: అబ్దుల్ సమద్, వివ్రాంత్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ దగర్, ఉమ్రాన్ మాలిక్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.