Mohammed Siraj: అంతలోనే ఎంతపనాయె.. మహ్మద్ సిరాజ్‌ ఆశలు గల్లంతు!

Mohammad Shami likely to play T20 World Cup 2022. భారత్ ఆడబోయే మూడు వన్డే మ్యాచ్‌ల కోసం మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోందట.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 30, 2022, 01:32 PM IST
  • అంతలోనే ఎంతపనాయె
  • మహ్మద్ సిరాజ్‌ ఆశలు గల్లంతు
  • కరోనా నుంచి కోలుకున్న షమీ
Mohammed Siraj: అంతలోనే ఎంతపనాయె.. మహ్మద్ సిరాజ్‌ ఆశలు గల్లంతు!

Mohammad Shami likely to play T20 World Cup 2022 rather than Mohammed Siraj : దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌, టీ20 ప్రపంచకప్‌ 2022కి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. బుమ్రా స్థానంలో హైదరాబాద్‌ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. దాంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌ తదుపరి రెండు మ్యాచ్‌లకు సిరాజ్‌ అందుబాటులో ఉండనున్నాడు. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని కాదని బీసీసీఐ సిరాజ్‌ వైపు బీసీసీఐ మొగ్గుచూపింది. 

దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో హైదరాబాద్ గల్లీ బాయ్ మహమ్మద్‌ సిరాజ్‌ రాణిస్తే.. అక్టోబర్ 16 నుంచి జరిగే టీ20 ప్రపంచకప్ 2022కు ఎంపికవుతాడని అందరూ భావించారు. అయితే సిరాజ్‌ ఆశలు అంతలోనే అవియరయ్యేలా ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ అనంతరం భారత్ ఆడబోయే మూడు వన్డే మ్యాచ్‌ల కోసం మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోందట. వన్డేలకు సిద్ధంగా ఉండమని షమీకి సమాచారాన్ని కూడా పంపించినట్లు తెలుస్తోంది. దాంతో సిరాజ్ రెండు టీ20 మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కానున్నాడు. 

కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న మహ్మద్ షమీ ఫిట్‌నెస్ సాధించాలనే ఉద్దేశంతోనే టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదట. వన్డేల కల్లా షమీ ఫిట్‌నెస్ సాధిస్తాడని బీసీసీఐ భావిస్తోందట. వన్డేలలో షమీ రాణిస్తే.. టీ20 ప్రపంచకప్ 2022కు ఎంపికవుతాడు. ఎందుకంటే షమీ ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ స్టాండ్‌బై లిస్ట్‌లో ఉన్నాడు. మెగా టోర్నీకి ముందు షమీతో ఓ సిరీస్‌ను ఆడించడం మంచిదనే అభిప్రాయాలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. మరి బుమ్రా స్థానంలో బీసీసీఐ ఎవరిని తీసుకుంటుందో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. 

Also Read: Mohammed Siraj: ద‌క్షిణాఫ్రికాతో సిరీస్‌.. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్‌ సిరాజ్

Also Read: Telangana Rain Alert : తెలంగాణలో మరో వారం కుండపోతే.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News