MS Dhoni becomes oldest Indian to hit IPL half-century: ఐపీఎల్ 2020, 2021లో పూర్తిగా నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. 15వ సీజన్ మొదటి మ్యాచులోనే దనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మహీ.. తనలోని ఒకప్పటి మెరుపు వీరుణ్ని బయటికి తీస్తూ అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. 40 ఏళ్ల వయసులోనూ ముచ్చటైన షాట్లు ఆడి అద్భుత హాఫ్ సెంచరీ (50 నాటౌట్; 38 బంతుల్లో 7×4, 1×6) చేశాడు. దాంతో తలా ఫాన్స్ మైదానంలో సందడి చేశారు. ఈలలు, కేకలు వేస్తూ సంబరాలు చేసుకున్నారు.
చెన్నై 61 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన దశలో ఎంఎస్ ధోనీ క్రీజులోకి వచ్చాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో తడబడ్డాడు. 2 పరుగులు చేయడానికి 10 బంతులు ఆడాడు. ఆ తర్వాత గేర్ మార్చి మిగతా 48 పరుగులను 24 బంతుల్లోనే బాదాడు. మొత్తంగా మహీ 38 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో ధోనీకి ఇది 24వ హాఫ్ సెంచరీ. ఇక మూడేళ్ల తర్వాత అర్ధ శతకం చేయడం విశేషం. అంతకముందు 2019లో బెంగళూరుపై 48 బంతుల్లో 84 పరుగులు చేశాడు.
కేకేఆర్‌పై ఎంఎస్ ధోనీ హాఫ్ సెంచరీ బాదడంతో ఓ రికార్డును తన పేరుపై నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అర్ధ శతకం బాదిన అతి పెద్ద వయసు భారతీయ బ్యాటర్‌గా మహీ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ పేరుపై ఉంది. ద్రవిడ్ 40 ఏళ్ల 116 రోజుల వయసులో హాఫ్ సెంచరీ బాధగా.. మహీ 40 ఏళ్ల 262 రోజులకు బాదాడు.
MSD Thala.! 🔥#WhistlePodu #Yellove #CSKvKKR 🦁💛 pic.twitter.com/H3FQj9oxlE
— Chennai Super Kings (@ChennaiIPL) March 26, 2022
చెన్నై ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్ బిల్లింగ్స్‌ను ఔట్ చేయడం ద్వారా బ్రావో 170వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు సాధించిన లసిత్ మలింగతో కలిసి తొలి స్థానంలో నిలిచాడు. అమిత్ మిశ్రా 160 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా.. 157 వికెట్లతో పియూష్ చావ్లా మూడో స్థానంలో ఉన్నాడు. ఇక హర్బజన్ సింగ్ 150 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
Also Read: Imran Khan Resign: రాజీనామాకు సిద్ధమైన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్?
Also Read: IPL 2022 Captains: ఐపీఎల్ టైటిల్ గెలిచిన కెప్టెన్‌లు ఆరుగురు.. ప్రస్తుతం ఉన్నది మాత్రం 'ఒకే ఒక్కడు'!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook