Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పేలవ ప్రదర్శన కొనసాగుతున్న సమయంలో హాకీ పురుషుల జట్టు సంచలనం సృష్టించింది. మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన నకబరుస్తున్న మన హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్‌లో సంచలన విజయం సాధించింది. ప్రపంచ నంబర్ 2గా ఉన్న బ్రిటన్ జట్టును ఓడించింది. క్వార్టర్‌లో భారత్ 1 (4)- 1 (2) తేడాతో బ్రిటన్‌ను చిత్తు చేసింది. మొదట 1-1తో మ్యాచ్ టై కాగా.. ఈ సందర్భంగా షూటౌట్ నిర్వహించారు. షూటౌట్‌లో భారత్ 4-2తో మ్యాచ్‌ను నెగ్గి సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
Also Read: Ana Carolina: బాయ్‌ఫ్రెండ్‌తో అర్ధరాత్రి చక్కర్లు.. ఒలింపిక్స్ నుంచి అమ్మాయి బహిష్కరణ
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన క్వార్టర్ ఫైనల్‌లో మొదటి క్వార్టర్‌లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేవు. రెండో క్వార్టర్‌లో భారత్‌కు షాక్ తగిలింది. డిఫెండర్ అమిత్ రోహిదాస్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బ్రిటన్ ఆటగాడి తలపై దురుద్దేశంతో హాకీ స్టిక్‌తో రోహిదాస్ కొట్టాడని ఆరోపణలు రావడంతో రెడ్‌కార్డుతో అతడు మైదానం బయటకు వచ్చడు. 10 మందితో ఆడిన భారత జట్టు 22వ నిమిషంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించాడు. ఈ గోల్‌తో భారత్ ఆధిక్యంలోకి వచ్చింది.
Also Read: Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. సరికొత్త చరిత్ర లిఖించిన మను భాకర్
అయితే ప్రత్యర్థి జట్టు 27వ నిమిషంలో గోల్ సాధించింది. బ్రిటన్ ఆటగాడు మోర్టన్ లీ చక్కటి గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. దీంతో ఆటలో ఉత్కంఠ ఏర్పడగా.. గోల్స్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా రెండు క్వార్టర్స్‌లో ఇరు జట్లు ఒక్క గోల్ చేయలేకపోయాయి. మ్యాచ్ టై కావడంతో నిర్వాహకులు షూటౌట్ నిర్వహించారు. ఈ షూటౌట్‌లో 4-2తో పీఆర్ శ్రీజేష్ జట్టు విజయం సాధించింది. ఆగస్టు 4వ తేదీ మంగళవారం భారత్ సెమీస్ ఆడనుంది. అయితే ప్రత్యర్థి జట్టు అనేది ఇంకా ఖరారు కాలేదు.
ఊరిస్తున్న పతకం
ఒలింపిక్స్‌లో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. తాజా సెమీస్‌తో వరుసగా రెండు ఒలింపిక్స్‌లో సెమీస్‌కు భారత జట్టు చేరింది. గత టోక్సో ఒలింపిక్స్‌లో కూడా భారత హాకీ జట్టు సెమీస్ చేరిన విషయం తెలిసిందే. ఈసారి ఎలాగైనా భారత్‌కు పతకం తీసుకురావాలనే పట్టుదలతో ఆటగాళ్లు ఉన్నారు. ఇదే స్ఫూర్తితో పోరాడితే కచ్చితంగా సెమీస్‌లో విజయం సాధించి పతకం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter