PBKS Vs DC Match Updates: టైటిల్ వేట మొదలు పెట్టిన ఢిల్లీ, పంజాబ్.. టాస్ గెలిచిన గబ్బర్.. తుది జట్లు ఇవే..!

Punjab Kings vs Delhi Capitals Toss Updates and Playing 11: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. రిషభ్ పంత్ రీఎంట్రీ ఇవ్వగా.. శిఖర్ ధావన్ కూడా ఏడాది తరువాత మైదానంలోకి దిగాడు. తుది జట్లు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 23, 2024, 03:53 PM IST
PBKS Vs DC Match Updates: టైటిల్ వేట మొదలు పెట్టిన ఢిల్లీ, పంజాబ్.. టాస్ గెలిచిన గబ్బర్.. తుది జట్లు ఇవే..!

Punjab Kings vs Delhi Capitals Toss Updates and Playing 11: పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆసక్తికరంగా సాగనుంది. రెండు జట్లు ఈసారైనా కప్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని ఢిల్లీ కెప్టెన్ రిషభ్‌ పంత్ తొలిసారి మైదానంలోకి దిగుతున్నాడు. అటు శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ సొంతమైదానంలో విజయం సాధించి టోర్నీని ఆరంభించాలని చూస్తోంది. మొహలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ ఆరంభించనుంది. 

Also Read: Virat Kohli: వెళ్లు.. వెళ్లు.. వెళ్లవయ్యా.. రచిన్ రవీంద్రకు పెవిలియన్ వైపు వేలు చూపించిన విరాట్ కోహ్లీ  

తుది జట్లు ఇలా..

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

సబ్‌స్టిట్యూట్స్‌: 

ఢిల్లీ: అభిషేక్ పోరెల్, ముఖేష్ కుమార్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, విక్కీ ఓస్ట్వాల్, ప్రవీణ్ దూబే

పంజాబ్ కింగ్స్: రిలీ రోసౌ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, తనయ్ త్యాగరాజన్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, విధ్వత్ కావరప్ప (ఈ ఆటగాళ్లలో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడతారు.)

"మేము ముందుగా ఫీల్డింగ్ చేయబోతున్నాం. ఇది కొత్త పిచ్. సరికొత్త వ్యూహాలతో ముందుకు రావాలని  అనుకుంటున్నాం. జట్టులో కొన్ని మార్పులు చేసాము. ఇప్పుడు ఈ పిచ్‌కు అలవాటు పడ్డాం. మాకు ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఈ వేదికపై కొంత అదృష్టం కోసం చూస్తున్నాం.. నలుగురు విదేశీ ఆటగాళ్లు బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, కుర్రాన్, రబడ తుది జట్టులో ఉన్నారు.." అని పంజాబ్ కెప్టెన్ ధావన్ తెలిపాడు.

"టాస్ గెలిచి ఉంటే.. మేము ముందుగా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లం. వికెట్ కొద్దిగా నెమ్మదిగా కనిపిస్తుంది. ఇది నాకు నిజంగా భావోద్వేగ సమయం. ప్రతిక్షణం ఆనందించాలనుకుంటున్నాను. పెద్దగా ఆలోచించడం లేదు. మేం బాగా ప్రిపేర్ అయ్యాం. నలుగురు ఓవర్సీస్ బ్యాటర్లు హోప్, మార్ష్, వార్నర్, స్టబ్స్ తుది జట్టులో ఉన్నారు.." అని ఢిల్లీ కెప్టెన్ రిషభ్‌ పంత్ తెలిపాడు.

Also Read: PBKS Vs DC Dream11 Team Tips: నేడే రిషభ్ పంత్ రీఎంట్రీ.. పంజాబ్‌తో ఢిల్లీ ఫైట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News