Virat Kohli: భారత్ జట్టు మాజీ సారధి, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈసీజన్‌లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్‌ప్రీత్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే సింగిల్ తీశాడు. దీంతో విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 6 వేల 500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
దీంతో ఈ రికార్డు సృష్టించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులు చేసి మరోసారి నిరాశ పరిచాడు. 14 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, సిక్సర్ బాది ఔట్ అయ్యాడు. 3.2 ఓవర్‌లో రబాడ బౌలింగ్‌లో రాహుల్ చాహర్ చేతికి చిక్కాడు. దీంతో బెంగళూరు అభిమానులు తీవ్ర నిరాశ గురైయ్యాడు. భారీ ఇన్నింగ్స్ ఆశించిన అభిమానులు షాక్ అయ్యారు. తదుపరి మ్యాచ్‌లోనైనా రాణించాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇప్పటివరకు ఐపీఎల్-2022లో మొత్తం 13 మ్యాచ్‌ల్లో 236 పరుగులు చేశారు. సగటు 19.37గా ఉంది. ఐపీఎల్(IPL)లో కెరీర్ చూస్తే 220 మ్యాచ్‌ల్లో 6 వేల 519 పరుగులు సాధించాడు. 16.22గా సగటు ఉంది. ఇందులో 5 సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలున్నాయి. రెండో స్థానంలో భారత ఆటగాడు శిఖర్ ధావన్ ఉన్నాడు. 204 మ్యాచ్‌ల్లో 6 వేల 186 పరుగులు ఉన్నాయి. వీరిద్దరే ప్రస్తుతం టాప్‌లో కొనసాగుతున్నారు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ 5 వేల 876, రోహిత్ శర్మ 5 వేల 829, సురేష్ రైనా 5 వేల 528 పరుగులతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.
Also read:Babu Class: కుప్పంలో టీడీపీ నేతలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్..!
Also read:One Family One Ticket: రేవంత్ రెడ్డి,ఉత్తమ్, భట్టి,కోమటిరెడ్డికి షాక్! టీపీసీసీలో రచ్చేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook