T20 World Cup Prize Money: అండర్ డాగ్‌గా ఎటువంటి అంచనాలు లేకుండానే బరిలో దిగి టీ-20 వరల్డ్ కప్‌లో కొత్త ఛాంపియన్‌గా అవతరించింది ఆస్ట్రేలియా టీమ్ (Australia). ఎప్పటిలాగే ఫైనల్ మ్యాచ్‌ల్లో (T20 Final Match) తమ సత్తా ఏంటో చాటింది. న్యూజిలాండ్ (Newzealand) నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.5 ఓవర్లలోనే చేధించి కప్పును ముద్దాడింది. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ దాదాపు రూ.42 కోట్లు కాగా... టీ20 విశ్వ విజేతగా నిలిచిన కంగారూ జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ లభించింది. ఫైనల్ గెలుపుతో రూ.11 కోట్ల 91 లక్షలు, సూపర్ 12 దశలో ఐదు లీగ్ మ్యాచ్‌ల్లో నాలుగింట నెగ్గినందుకు అదనంగా మరో రూ.1.2కోట్లు ఆ జట్టుకు దక్కాయి. అంటే మొత్తంగా రూ.13 కోట్ల పైచిలుకు ఆస్ట్రేలియా జట్టు ఖాతాలో పడింది.
రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ (Newzealand) జట్టుకు రూ.5 కోట్ల 95 లక్షలతో పాటు సూపర్ 12 దశలో ఐదింట నాలుగు మ్యాచ్‌లు గెలిచినందుకు అదనంగా మరో రూ.1.2కోట్లు లభించాయి. సెమీ ఫైనల్స్ వరకు వెళ్లిన ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లకు చెరో రూ.3 కోట్ల వరకు లభించాయి. సూపర్ 12లో ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచినందుకు పాకిస్తాన్‌కు (Pakistan) అదనంగా మరో 1.5 కోట్లు, ఐదింటికి నాలుగు మ్యాచ్‌లు గెలిచినందుకు ఇంగ్లాండ్‌కు (England) మరో రూ.1.2 కోట్లు లభించాయి. సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధించిన జట్లకు రూ.52 లక్షలు చొప్పున లభించాయి. అలాగే ఒక్కో విజయానికి రూ.30 లక్షలు అదనంగా అందించారు. ఈ మెగా టోర్నీలో సెమీస్ చేరకుండానే ఇంటి బాట పట్టిన టీమిండియాకు దాదాపు రూ.1.42 కోట్లు లభించాయి. సూపర్ 12 చేరినందుకు రూ.52లక్షలు, 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించినందుకు ఒక్కో మ్యాచ్‌కు రూ. 30 లక్షలు చొప్పున రూ.90 లక్షలు లభించాయి.
Also Read : AUS Winning Celebration: 'షూలో బీర్' పోసుకొని తాగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు..వైరల్
దుబాయ్ వేదికగా ఆదివారం( నవంబర్ 14) ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ (Aus vs NZ) జట్ల మధ్య టీ20 ఫైనల్ పోరు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అలవోకగా విజయ తీరాలకు చేరింది. కెప్టెన్,ఓపెనర్ అరోన్ ఫించ్ (5) విఫలమైనా మరో ఓపెనర్ వార్నర్ (53), మిచెల్ మార్ష్ (77) పరుగులతో 8 వికెట్ల తేడాతో కివీస్‌పై ఆసీస్ విజయం సాధించింది. మొదట కివీస్ 4 వికెట్లకు 172 పరుగులు చేయగా 18.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి ఆసీస్ టార్గెట్‌ను చేధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి