T20 World Cup 2021 India vs pakistan Virat Kohli says it's important to give players periodic breaks from bio-bubble life: క్రికెటర్లు..ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కోసారి వరుస సిరీస్‌లతో కనీసం విశ్రాంతి తీసుకోవడానికి వారికి అవకాశం ఉండదు. అయితే కరోనా కాలంలో సుదీర్ఘ కాలంపాటు బయో బబుల్‌లో గడపటం వల్ల కొందరు క్రికెటర్లు ఇబ్బందులుపడుతున్నారు. ఇది వారి మానసిక స్థితిపై ప్రభావం చూపింది. క్రిస్ గేల్ వంటి సీనియర్లు కూడా బయో బబుల్‌లో ఉండలేక ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలిగారు.
టీ20 వరల్డ్‌కప్-2021 (T20 World Cup 2021) ఈవెంట్‌కు టీమిండియా సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) కీలక వ్యాఖ్యలు చేశారు. బయో బబుల్‌లో గడపటం అంత తేలికేమీ కాదని... భవిష్యత్తులో దీని ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. కొన్ని కారణాలవల్ల చాలా కాలం పాటు గ్యాప్ రావడం వల్ల వరుస సిరీస్‌లు, (Seriess) టోర్నీలతో అభిమానులను అలరించేందుకు ఆటగాళ్లు తమ వంతు కృషి చేస్తున్నారన్నారు. ఇక బయో బబుల్ లైఫ్ (bio-bubble life) గురించి ఇప్పటికే చాలా సార్లు మాట్లాడామన్నారు. నిజానికి ఐపీఎల్లో (IPL) ఆడటం వల్ల మాకు ఆ పరిస్థితులు అలవడ్డాయని కోహ్లి (Kohli) చెప్పుకొచ్చారు.
Also Read : Shoaib Akhtar Comments:భారత ఆటగాళ్లకు నిద్రమాత్రలు ఇవ్వాలి..కోహ్లీ ఇన్‌స్టాకు దూరంగా
అయినా తమకు ప్రతిరోజూ ఒక కొత్త సవాలే అన్నారు. ఇప్పుడు వరల్డ్‌కప్ టోర్నీలోనూ అదే పరిస్థితి ఉందన్నారు. ఇక్కడ ప్రపంచ దేశాల జట్లతో ఆడతామన్నారు కోహ్లి (Kohli). ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పోటీ పడని జట్టుతో ఆడే పరిస్థితి రావొచ్చన్నారు. కాబట్టి మరింత జాగ్రత్తగా ముందుకు సాగవలసి ఉంటుందని పేర్కొన్నారు.
బయో బబుల్‌లో (bio-bubble) ఉండే ఒత్తిడి, ఇతర విషయాల గురించి అందరు ఆటగాళ్లు స్వేచ్ఛగా మాట్లాడాలని విరాట్ కోహ్లి చెప్పారు. వాస్తవానికి అక్కడ ఉన్నపుడు ఎవరి మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేమన్నారు. ఒక ఐదారుగురు ఆటగాళ్లు నవ్వుతూ ఉన్నంత మాత్రాన జట్టులోని అందరు ఆటగాళ్లు అదే విధంగా సంతోషంగా ఉంటారని అనుకోవడం పొరపాటే అని విరాట్ కోహ్లి (Virat Kohli) చెప్పారు.
Also Read : Baba Ramdev: క్రికెట్, టెర్రర్ ఒకేసారి ఆడటం కష్టమంటున్న బాబా రాందేవ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook