Sunil Gavaskar: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియానే ఫేవరెట్‌..ఎందుకంటే...

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ కే గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని  టీమిండియా మాజీ సారథి సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 10:52 AM IST
Sunil Gavaskar: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియానే ఫేవరెట్‌..ఎందుకంటే...

T20 WC, Aus vs NZ Final: టీ20 ప్రపంచకప్ 2021(T20 World Cup 2021)లో భాగంగా...ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో..ఎవరు గెలుస్తారనే విషయంపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. మాజీలు, క్రికెట్ విశ్లేషకులు ఎవరికీ వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ మ్యాచ్ పై టీమిండియా మాజీ సారథి సునీల్ గావస్కర్(Sunil Gavaskar) మీడియాతో మాట్లాడాడు. 

నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఘన చరిత్ర కలిగిన ఆస్ట్రేలియా(Australia) జట్టే ఫేవరెట్‌గా ఉందని.. కీలక మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓడిన వాటికన్నా గెలిచిన సందర్భాలే ఎక్కువని గావస్కర్ చెప్పుకొచ్చారు. బరిలోకి దిగాక ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తమకు అనుకూలంగా మార్చుకుంటారని పొగిడారు. ఆ జట్టు ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చిందని.. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో కేవలం కివీస్(New Zealand) పైనే కాకుండా అన్ని జట్లపైనా కంగారూల ఆధిపత్యం కొనసాగిందని గుర్తుచేశారు. ఈసారి కూడా అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ముద్దాడతారని గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. 

Also read: T20 World Cup 2021 Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో గెలిచేదెవరు?

ఇప్పటివరకు ఐసీసీ(ICC) టోర్నీల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు(AUS vs NZ) మొత్తం 18 సార్లు తలపడగా అందులో 12 సార్లు కంగారూలే విజయం సాధించారు. అలాగే మొత్తం 31 నాకౌట్‌ మ్యాచ్‌ల్లో 20 విజయాలు సాధించి దాదాపు అన్ని జట్లపైనా ఆస్ట్రేలియా ఆధిపత్యం చలాయించింది. ఈ క్రమంలోనే ఐదుసార్లు వన్డే ప్రపంచకప్‌ విజేతగా, రెండు సార్లు ఛాంపియన్స్‌ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచిందని గావస్కర్  అన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News