Team India: టీ20ల్లో అత్యధిక స్కోర్లు చేసిన భారత ఆటగాళ్ల జాబితా..ఇదే..!

Team India: టీ20ల్లో టీమిండియా ఆటగాళ్లకు మంచి రికార్డులు ఉన్నాయి. తాజాగా ఈజాబితాలో భారత మాజీ సారధి విరాట్ కోహ్లీ చేరాడు. ఆటగాళ్ల రికార్డులు ఇవిగో..

Written by - Alla Swamy | Last Updated : Sep 9, 2022, 06:50 PM IST
  • టీ20ల్లో భారత ఆటగాళ్ల రికార్డులు
  • అత్యధిక స్కోర్లు చేసిన ప్లేయర్
  • తాజాగా కోహ్లీ రికార్డు
Team India: టీ20ల్లో అత్యధిక స్కోర్లు చేసిన భారత ఆటగాళ్ల జాబితా..ఇదే..!

Team India: టీ20ల్లో భారత తరపున అత్యధిక స్కోర్లు చేసిన వారిలో హేమాహేమీలు ఉన్నారు. ఇందులో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. 

విరాట్ కోహ్లీ..

ఈనెల 8న ఆసియా కప్‌లో భాగంగా అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. 122 పరుగులతో రఫ్ఫాడించారు. టీ20ల్లో అతడికి ఇదే అత్యధిక స్కోర్. 

రోహిత్ శర్మ..

ఈజాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. 2017లో శ్రీలంక మ్యాచ్‌లో 118 పరుగులు సాధించాడు. 

సూర్యకుమార్ యాదవ్..

ఇటీవల యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈఏడాది జులై ఇంగ్లండ్‌ గడ్డపై విశేషంగా రాణించాడు. ఆ జట్టుపై 117 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ

అత్యధిక స్కోర్లు చేసిన జాబితాలో రెండోసారి రోహిత్ శర్మ చోటు దక్కింది. 2018లో విండీస్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇందులో 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

కేఎల్ రాహుల్..

టీ20ల్లో టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. 2016లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లో 110 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ..

ఈజాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడోసారి నిలిచాడు. 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 66 బంతుల్లో 106 పరుగులు సాధించాడు. 

దీపక్ హుడా..

యువ ఆటగాడు దీపక్ హుడా ఇటీవల అరుదైన రికార్డు సాధించాడు. ఈఏడాది ఐర్లాండ్‌తో 57 బంతుల్లో 104 పరుగులు చేశాడు. 

కేఎల్ రాహుల్..

అత్యధిక స్కోర్లు చేసిన జాబితాలో రెండోసారి కేఎల్ రాహుల్ చోటు దక్కించుకున్నాడు. 2016లో విండీస్‌ మ్యాచ్‌లో 51 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు.

సురేష్‌ రైనా..

టీమిండియా ఆటగాడు సురేష్‌ రైనా సైతం ఈజాబితాలో ఉన్నాడు. 2010లో ఇంగ్లండ్‌పై 60 బంతుల్లో 101 పరుగులు సాధించాడు.

రోహిత్ శర్మ..

అత్యధిక స్కోర్లు సాధించిన జాబితాలో రోహిత్ శర్మ నాలుగోసారి చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో 2018లో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లో వంద పరుగులు చేశాడు.

Also read:Rahul Gandhi: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు రాహుల్ గాంధీనేనా..ఆయన ఏమన్నారంటే..!

Also read:Team India: టీ20ల్లో బెస్ట్ బౌలింగ్ వేసిన టాప్ 10 భారత ఆటగాళ్లు వీరే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News