Virat Kohli DucK Out: విరాట్ కోహ్లీ డకౌట్ అయితే చాలా సంతోషించాను, బౌలర్లు కోరుకునేది ఇదేనట

Virat Kohli DucK Out: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంటి టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం చాలా సంతోషంగా ఉందన్నాడు ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్. ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 14, 2021, 01:46 PM IST
Virat Kohli DucK Out: విరాట్ కోహ్లీ డకౌట్ అయితే చాలా సంతోషించాను, బౌలర్లు కోరుకునేది ఇదేనట

Virat Kohli DucK Out: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో డకౌట్ కావడం తెలిసిందే. అయితే కోహ్లీ లాంటి టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం చాలా సంతోషంగా ఉందన్నాడు ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్. శుక్రవారం జరిగిన తొలి T20లో రషీద్ బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

గత 5 ఇన్నింగ్స్‌లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకంగా 3 పర్యాయాలు డకౌట్ కావడం అతడి ఫామ్‌పై అనుమానాలు కలిగిస్తోంది. అయితే కోహ్లీ చివరిసారిగా 2019 నవంబర్ నెలలో టెస్టు శతకం సాధించగా, అదే ఏడాది ఆగస్టులో వన్డేల్లో శతకం నమోదు చేశాడు. ఆ తరువాత అతడు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడటం లేదు. కెరీర్‌లో కోహ్లీ(Virat Kohli) మొత్తం 28 పర్యాయాలు ఖాతా తెరవకుండా ఔట్ కాగా, అందులో ఏకంగా 9 పర్యాయాలు ప్రత్యర్థి జట్టుగా ఇంగ్లాండ్ జట్టు ఉండటం గమనార్హం. 

Also Read: SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులు ఈ ఒక్కరోజు UPI ట్రాన్సాక్షన్స్ చేయవద్దు, ఎందుకంటే

నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో టీమిండియా(Team India)పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ వికెట్ తీసుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందని ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అన్నాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టించే విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడి వికెట్ సాధ్యమైనంత త్వరగా తీస్తే, ప్రత్యర్థి జట్టుకు చాలా కలిసొస్తుందన్నాడు. శనివారం నాడు ఈసీబీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోహ్లీ డకౌట్‌పై స్పందించాడు.

భారత ప్రేక్షకులు కోహ్లీకి మద్దతు తెలుపుతూ గట్టిగా నినాదాలు చేశారని, అయితే అలాంటి ఆటగాడు డకౌట్ అయితే స్టేడియం నిశ్శబ్ధంగా మారిందని గుర్తు చేసుకున్నాడు. ప్రపంచ స్థాయి ఆటగాడైన కోహ్లీ డకౌట్ లాంటి వికెట్లు సాధిస్తే బౌలర్లలో ఆత్వవిశ్వాసం పెరుగుతుందని చెప్పాడు. నిత్యం నేర్చుకుంటూ కెరీర్‌లో ఎదగాలని తాపత్రయ పడతానని లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ చెప్పుకొచ్చాడు. నేడు ఇంగ్లాండ్, భారత్ జట్లు రెండో టీ20లో తలపడనున్నాయి.

Also Read: Mithali Raj Record: తెలుగు తేజం మిథాలీరాజ్ అద్భుతం, టీమిండియా తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News