Rape Case filed on Team India Players: టీమిండియా (Team India) ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు.. దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) సహాయకుడు రియాజ్ భాటి భార్య... రెహ్నుమా భాటి (Riyaz Bhati Wife Rehnuma Bhati) కొందరు టీమిండియా ఆటగాళ్లు మరియు బీసీసీఐ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా (Rajiv Shukla), పృథ్వీరాజ్ కొఠారీ (Prithviraj Kothari) పై సెక్స్ స్కాండల్ ఆరోపణలు చేసింది. హార్దిక్, మునాఫ్ పటేల్ (Munaf Patel) బీసీసీఐ (BCCI)మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా, పృథ్వీరాజ్ కొఠారీలు సెక్స్ చేయమని బలవంతం చేసారని పోలీస్ కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది.
అనుమానాస్పద గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న తన భర్త.. ఉన్నత వ్యక్తిత్వంతో లైంగిక సంబంధం పెట్టుకోమని బలవంతం చేశాడని రెహ్నుమా భాటి పేర్కొన్నారు. అయితే, ఈ సంఘటనల గురించి రెహ్నుమా భాటి పోలీసులకు తగినన్ని వివరాలు తెలుపలేకపోయింది. కానీ, ఈ ఘటనలో పాల్గొన్న రాజీవ్ శుక్లా మరియు హార్దిక్ పాండ్యా పేర్లను నొక్కి మరీ చెప్పటం మరో విశేషం. కానీ ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నా పోలీసులు తనకు సహకరించలేదని ఆమె ఆరోపించింది.అంతేకాకూండా, దీనికి సంబంధించి దరఖాస్తు సెప్టెంబర్‌లోనే చేశానని ఆరోపించింది.
COMPLAINT COPY EXCLUSIVE‼️ https://t.co/Nj2U9UoA8P pic.twitter.com/o5uWCoDfLx
— Sameet Thakkar (@thakkar_sameet) November 10, 2021
Also Read: Norovirus: నిన్న కరోనా..ఈ రోజు నోరో వైరస్..భయం గుప్పిట్లో కేరళ.. లక్షణాలు, చికిత్స
"నేను వివిధ స్థాయిలలో ఉన్నత పోలీసు అధికారులను అనేకసార్లు కలిసాను. డబ్బులు ఇస్తేనే కేసు తీసుకుంటామని చెప్పారు.. డబ్బులు ఎందుకు ఇవ్వాలని? ప్రశ్నించాను.. నా హాక్కును సరైన పద్దతిలో వాడుకోవాలనుకుంటున్నాను.. వారు నేరస్థులు" అని రెహ్నుమా భాటి ఆరోపించారు.
మీడియా నివేదికల ప్రకారం, ఇవే విషయాలను డిప్యూటీ కమీషనర్ (Deputy Commissioner of Police) మంజునాథ్ సింఘే (Manjunath Singhe) ను ప్రశ్నిస్తే... ఫిర్యాదు తీసుకున్నామని.. మీడియాతో షేర్ చేసుకునే వివరాలు తన వద్ద ప్రస్తుతం లేవని ఆయన తెలిపారు.
Rehnuma Bhati,wife of Riyaz Bhati(alleged close aide of Dawood Ibrahim) registered complaint at Mumbai's Santacruz PS on Sept 24 alleging rape-molestation by Riyaz Bhati,Munaf Patel,Rajeev Shukla,Hardik Pandya&Prithviraj Kothari. Police verifying allegations,no FIR registered yet
— ANI (@ANI) November 12, 2021
Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!
సోషల్ మీడియా వినియోగదారుడు సమీత్ ఠక్కర్ (Sameet Thakkar), ముంబై పోలీస్ స్టేషన్‌లోని (Mumbai Police Station) శాంతాక్రూజ్‌లో (Santacruz) రెహ్నుమా దాఖలు చేసిన ఫిర్యాదు కాపీని సెప్టెంబర్ 24, 2021న ట్విట్టర్ లో షేర్ చేసాడు.. ప్రస్తుతం ఈ ఫిర్యాదు కాపీ తెగ వైరల్ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి