Without Suryakumar Yadav all three formats should not even exist feels Suresh Raina: 2022 టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్‌ను ఐసీసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 'ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు సూర్య ఖాతాలో చేరింది. టీ20ల్లో ఇప్పటికే తన సత్తా నిరూపించుకున్న సూర్యకుమార్.. వన్డేల్లోనూ నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. 20 వన్డేలు ఆడిన సూర్య.. 433 రన్స్ చేశాడు. ఇక ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌కు కూడా అతడు ఎంపికయ్యాడు. టెస్ట్ తుది జట్టులోనూ అతడికి స్థానం కల్పించాలని డిమాండ్లూ వచ్చాయి.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్.. టెస్టుల్లో ఏ మేరకు రాణిస్తాడనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీల్ సురేశ్ రైనా.. సూర్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య ప్రదర్శనపై అభినందనలు కురిపిస్తూ.. అతడు లేకపోతే మూడు ఫార్మాట్లు కూడా ఉండవని పేర్కొన్నాడు. 'సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో బరిలోకి దిగాలి. సూర్య ఆడే విధానం చాలా బాగుంది. విభిన్న షాట్లను ఆడాలనే అతడి ప్లానింగ్ అద్భుతం. ఎటువంటి భయం లేకుండా మైదానం నలువైపులా షాట్లు కొడతాడు' అని రైనా అన్నాడు.
'సూర్యకుమార్ యాదవ్ ముంబై ప్లేయర్. అతడు ప్రస్తుతం ముంబై జట్టులో ఉన్నాడు. కాబట్టి రెడ్ బాల్ క్రికెట్‌లో ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. ఇప్పుడు టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. సూర్యకు ఇదొక అద్భుత అవకాశం. సూర్య ఆడిన తీరు చూస్తే అతడు సుదీర్ఘ ఫార్మాట్లో కూడా పరుగులు చేస్తాడు. టెస్టు క్రికెట్ ఆడటం వల్ల వన్డేల్లోనూ రాణించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా సూర్య సెంచరీలు, ద్విశతకాలు సాధించగలడు' అని మిస్టర్ ఐపీల్ సురేశ్ రైనా ఆశాభావం వ్యక్తం చేశాడు.
భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా మాట్లాడుతూ... 'సూర్యకుమార్ యాదవ్ తప్పకుండా టెస్టుల్లో ఆడాలి. అతడి ప్రదర్శన అద్భుతంగా ఉంది. మూడు ఫార్మాట్లలోనూ సూర్య ఆడితే చాలా బాగుంటుంది. అయితే ఇలాంటి చర్చ రావడానికి ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖాన్. రంజీల్లో అదరగొట్టాడు. కానీ అతనికి కూడా టైమ్ వస్తుంది. అయితే సూర్య టెస్టు జట్టులో ఉండేందుకు వందశాతం అర్హత ఉంది' అని ఓజా చెప్పుకొచ్చాడు.
Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్ ఎంగేజ్‌మెంట్.. వైరల్ పిక్స్!
Also Read: Republic Day 2023 Cars Offers: రిపబ్లిక్ డే 2023 ఆఫర్.. ఈ కార్లపై రూ. 72 వేల డిస్కౌంట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.