Young Woman kissing Virat Kohli statue at Madame Tussauds: భారత క్రికెట్ చరిత్రలోనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనూ అత్యుత్తమ ఆటగాళ్లలో రికార్డుల రారాజు 'విరాట్ కోహ్లీ' ముందు వరుసలో ఉంటాడు. ప్రత్యర్థి ఎవరైనా, బౌలర్ ఎలాంటోడైనా, మైదానం ఎలా ఉన్నా, ఫార్మాట్ ఏదైనా విరాట్ బరిలోకి దిగితే.. పరుగుల వరద పారుతుంది. తన అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియాకు ఇప్పటికే ఎన్నో విజయాలు అందించాడు. స్టార్ బ్యాటర్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇందులో మహిళా డై హార్డ్ ఫాన్స్ కూడా ఉన్నారు.
విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోహ్లీ ఎక్కడికి వెళ్లినా అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడతారు. కోహ్లీనే కాదు అతడి విగ్రహాన్ని కూడా ఫాన్స్ చాలా అభిమానిస్తారు. తాజాగా ఓ యువతి కోహ్లీ విగ్రహానికి లిప్ కిస్ ఇచ్చింది. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌లోని విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాంకు లిప్ కిస్ పెట్టింది. అంతేకాదు తనకు కోహ్లీ కిస్ ఇస్తున్నట్లుగా ఓ పోస్ కూడా ఇచ్చింది. ఈ తంతగాన్ని ఆ యువతి స్నేహితురాలు వీడియో తీసింది.
విరాట్ కోహ్లీ విగ్రహానికి యువతి లిప్ కిస్ ఇచ్చిన వీడీయో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మైనపు విగ్రహంతో యువతి పోజులిచ్చి ఫొటోస్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోస్, వీడియోకి నెట్టింట లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'భలే ఛాన్స్ కొట్టేసింది' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'పాపం అనుష్క శర్మ' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. సదరు యువతి కోహ్లీకి వీరాభిమాని అయి ఉంటుందని సమాచారం తెలుస్తోంది. ఇక సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోన్న విషయం తెలిసిందే.
With a statue... pic.twitter.com/TXU67kSlYz
— Gems of Simps (@GemsOfSimps) February 20, 2023
ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023తో విరాట్ కోహ్లీ బిజీగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు పెద్దగా రాణించలేకపోయిన కోహ్లీ తొలి టెస్ట్‌లో 12.. రెండో టెస్ట్‌లో 44, 20 పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 106 టెస్టుల్లో, 271 వన్డేల్లో, 115 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ స్థాయిలో 74 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లీ.. 25 వేలకు పైగా రన్స్ చేశాడు.
Also Read: Chicken Kills Man: సీన్ రివర్స్.. మనిషినే చంపేసిన కోడి! ఎలానో తెలిస్తే షాక్ అవుతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.