World Test Championship 2023: లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో రేపట్నించి టీమ్ ఇండియా, ఆస్ట్రేలియాలు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం తలపడనున్నాయి. జూన్ 7 నుంచి 11 వరకూ డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. బొటనవేలి గాయంతో రోహిత్ శర్మను బలవంతంగా మ్యాచ్ నుంచి తప్పించనున్నారా అంటే అవుననే తెలుస్తోంది.
టీమ్ ఇండియా సారధి రోహిత్ శర్మ రేపు ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడటం సందేహమే. ఇవాళ జరిగిన ప్రాక్టీస్‌లో అతడి బొటనవేలికి గాయమైంది. ఎడమచేతి బొటనవేలికైన గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం కావచ్చని తెలుస్తోంది. బొటనవేలి గాయం తీవ్రమైందా లేదా అనే వివరాలు ఇంకా తెలియలేదు. గాయమైన తరువాత రోహిత్ శర్మ ఆ చేతికి గ్లోవ్స్ వేసుకుని చూడటం కన్పించింది. అంటే గాయం అంత సీరియస్ కాకపోవచ్చని భావిస్తున్నారు.
లండన్‌లోని ఓవల్ స్టేడియంలో రేపట్నించి ప్రపంచకప్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ పోరు జరగనుంది. ప్రపంచకప్ టెస్ట్ ఛాంపియన్‌లుగా టీమ్ ఇండియా, ఆస్ట్రేలియాలో ఏ జట్టు నిలబడుతుందో ఆసక్తి రేపుతోంది. గాయం కారణంగా రేపటి ఫైనల్ పోరుకు టీమ్ ఇండియా సారధి రోహిత్ శర్మ సిద్ధంగా ఉంటాడా లేడా అనేది తేలేందుకు మరికాస్త సమయం పట్టవచ్చు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
WTC final టీమ్ ఇండియా:
రోహిత్ శర్మ, శుభమన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్
WTC final ఆస్ట్రేలియా:
ప్యాట్ కమ్మిన్స్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హ్యారిస్, ట్రేవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లాబుస్చాంగ్నే, నాథన్ ల్యాన్, టాడ్ మర్ఫీ, మైకేల్ నెసిర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి