Tesla’s Shanghai Plantఎంతో మంది పోటీ పడ్డా అందర్ని అదిగమించి ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్. ఇప్పుడు ఆసక్సెస్‌ను మాత్రం ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ట్వీట్టర్ పై మోజుతో అవసరానికి మించి పెట్టుబడి పెట్టిన మస్క్... నిధుల సమీకరణ కోసం టెస్లా షేర్లను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. ట్వీట్టర్ కొనుగోలు చేశారని వార్తలు వెలువడిన వెంటనే టెస్లా షేర్లు దారుణంగా పతనమయ్యాయి. మరోవైపు ట్వీట్టర్‌కు డబ్బులు కట్టాల్సిన తేదీ దగ్గరపడడంతో భారీ నష్టాలను టెస్లా షేర్లను అమ్ముకోవాల్సి వచ్చింది.
family members dies in China after eating noodles | నూడుల్స్ తిని ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కుటుంబసభ్యులు మృత్యువాతపడ్డారు. వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా.. చైనాలోని హీలాంగ్జియాంగ్లో ఈ దారుణం చోటుచేసుకుంది.
భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా ( China ) పీపుల్స్ లిబరేటెడ్ ఆర్మీ సైనికుడిని తూర్పు లడఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో ఇండియన్ ఆర్మీ (india) ఇటీవల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సైనికుడిని మంగళవారం రాత్రి ఇండియన్ ఆర్మీ అధికారులు చైనా అధికారులకు అప్పగించారు.
భారత్‌పై చైనా మరోసారి కుట్రకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని, ఈ మేరకు ఉత్తర సరిహద్దుల్లో చైనా సుమారు 60 వేల మంది సైనికుల్ని మోహరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పొంపియో (Mike Pompeo) పేర్కొన్నారు. క్వాడ్ (QUAD) దేశాలైన అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలపై చెడు ప్రవర్తనతో.. చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పాంపియో ఆగ్రహం వ్యక్తంచేశారు.
రఫేల్ ఫైటర్ జెట్స్.. భారత వైమానిక దళంలోకి చేరాయి. గురువారం అంబాలా ఐఏఎఫ్ ఏయిర్‌బేస్‌లో ఐదు రఫేల్ యుద్ధ విమానాల ఇండక్షన్ సెర్మనీ కార్యక్రమంలో అట్టహాసంగా జరిగింది.
భారత్-చైనా సైన్యం మధ్య సోమవారం అర్థరాత్రి కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చైనా మరో ముందడుగు వేసి.. భారత సైన్యమే వాస్తవ నియంత్రణ రేఖను దాటి కాల్పులు జరిపిందంటూ మంగళవారం ఉదయం ఆరోపించింది. అయితే.. చైనా ఈ ప్రకటనను భారత ఆర్మీ ఖండించింది.
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా భారత సైన్యంపై దురాఘాతానికి పాల్పడ్డ నాటినుంచి సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా.. ఇరుదేశాల మధ్య కాల్పులు జరిగినట్లు సమాచారం.
సరిహద్దు వెంబడి మళ్లీ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు రోజుల క్రితం చైనా సైన్యం భారత భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడంతో మన సైన్యం అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏల్ఏసీ వెంబడి చైనాతో ( India vs China) ఉద్రిక్తత పరిస్థితులు నిత్యం పెరుగుతుండటంతో కేంద్ర హోం శాఖ (Home Ministry ) అప్రమత్తమైంది.
గాల్వన్ లోయ (Galwan Valley)లో జూన్ నెలలో చైనా సైనికుల దురాగతానికి 14 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. తమకే పాపం తెలియదని చెప్పిన చైనా తాజాగా కుయుక్తులు పన్నుతోంది.
Global Times Survey About Narendra Modi | సర్వేలో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. తమ దేశ అధినేతల పాలన కన్నా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 50 శాతం పౌరులు జై కొట్టినట్లు సర్వేలో తేలింది. భారత్‌ను ద్వేషించే చైనీయులలో సగం మంది మన ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత సైన్యంపై చైనా దురఘాతానికి పాల్పడిన నాటి నుంచి ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ( Bipin Rawat ) చైనాకు వార్నింగ్ ఇస్తూ కీలక ప్రకటన చేశారు.
India Vs China | గాల్వన్ లోయ వివాదంలో 20 మంది భారత జవాన్లు అమరులైన తర్వాత భారత్, చైనాల మధ్య పరిస్థితులు కాస్త ఉద్రికత్తంగా మారాయి. ముఖ్యంగా భారత్‌లో చైనా వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయి. అయితే తమ మద్దతు భారత్‌కే ఉంటుందని అమెరికా స్పష్టం చేసింది.
గాల్వన్ లోయ(Galwan Valley)లో వారం రోజుల కిందట జరిగిన ఘర్షణలో తెలంగాణ వాసి కల్నల్ బికుమళ్ల సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అయితే తమ జవాన్ల మరణాలపై నోరు విప్పకుండా కాలయాపన చేస్తున్న చైనా ఎట్టకేలకు స్పందించిది. కానీ 1962 యుద్ధాన్ని మరోసారి రిపీట్ చేస్తామంటూ హెచ్చరికలు పంపడం గమనార్హం.
మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత మరో స్థాయికి చేరింది. ఏకంగా విదేశాల్లోని కరోనా కేసులు, కరోనా మరణాలను సైతం మహారాష్ట్ర దాటేయడం ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం వెయ్యి కేసులు, వంద మరణాలతో పరిస్థితి భీకరంగా మారింది.
ప్రపంచాన్ని గజ గజా వణికిస్తున్న కరోనా వైరస్.. భారత్‌లోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ అనుమానిత కేసులు ఉండగా.. తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఒక్కో కేసు నమోదైంది.
కరోనా వైరస్ ప్రభావంతో పలకరింపులే మారిపోయాయి. ఇదివరకటిలాగా చేతులు కలుపుకోవడం.. షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం.. ఆత్మీయంగా కౌగిలించుకోవడం..ఇలా అంతా మారిపోయింది. ఇప్పుడు కొత్త తరహా పలకరింపులు మొదలయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు 27 దేశాల ప్రజలు గడగడా వణుకుతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొచ్చి పడుతుందోనని భయపడుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 3 వేల మంది మృత్యువాతపడ్డారు.
చైనాను గడగడలాడిస్తున్న 'కరోనా వైరస్' .. కాస్త శాంతించినట్లు తెలుస్తోంది. వుహాన్‌లో ప్రారంభమై.. అతి కొద్ది కాలంలోనే చైనా అంతటికి కరోనా వైరస్ విస్తరించింది. దీంతో కరోనా వైరస్ పేరు చెబితేనే గజగజా వణికే పరిస్థితి నెలకొంది.
ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారి చైనాలో మరిన్ని ప్రాణాల్ని బలిగొంది. కరోనా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా.. పాజిటీవ్ కేసులు పెరిగిపోవడంతో ఆందోళన మొదలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.