'కరోనా వైరస్' కేసులు పెరుగుతున్న ఇటలీలో తెలంగాణ విద్యార్థులు చిక్కుకున్నారు. రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. తమను స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు.
ఆడపిల్ల.. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. కాదేదీ..కవితకు అనర్హం అన్నాడు ఓ మహాకవి. అలాగే.. 'కరోనా వైరస్' ప్రభావానికి ఇది.. అదీ అని తేడా లేకుండా పోయింది. అన్ని రంగాలపై కరోనా వైరస్ దెబ్బ పడుతోంది. ఇంకా చెప్పాలంటే కరోనా వైరస్ ప్రభావానికి ఏ రంగమైనా గజగజా వణికిపోతోంది.
'కరోనా వైరస్'.. ఈ పేరు వింటేనే... వెన్నుపూసలో వణుకుపుడుంతోంది. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా .. 'కరోనా వైరస్' గురించే చర్చించుకుంటున్నారు. మొత్తంగా 80కి పైగా దేశాల్లో కరోనా వ్యాప్తి చెందింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
'కరోనా వైరస్' ప్రభావం ప్రపంచంలో అన్నింటిపైనా పడుతోంది. ఇప్పటికే క్రీడలపై ఈ ప్రభావం పడింది. ఇప్పుడు తాజాగా సౌదీ అరేబియాపైనా ప్రభావం చూపిస్తోంది. సౌదీ అరేబియాలోని మక్కాకు చాలా మంది ముస్లిం భక్తులు. . హజ్ ను దర్శించుకోవడానికి వెళ్తుంటారు.
'కరోనా వైరస్' . . ఈ పేరు వింటేనే సామాన్య జనానికి ఒంటిలో నుంచి వణుకుపుడుతోంది. దీంతో ఈ వైరస్ బారిన పడవద్దని. . ప్రభుత్వాలు, వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు కరోనా వైరస్ గురించే చర్చ జరుగుతోంది. కానీ అప్పట్లో 'కరోనా వైరస్' లాంటి వైరస్ లు ప్రపంచాన్ని గడగడా వణికించాయి. సార్స్, మెర్స్, ఎబోలా ఇలాంటి వైరస్ లు ఉపద్రవాన్ని సృష్టించాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గజ గజా వణికిస్తున్న 'కరోనా వైరస్' తెలంగాణలోనూ ప్రవేశించడంతో కలకలం రేగుతోంది. హైదరాబాద్లో నమోదైన తొలి పాజిటివ్ కేసు గుబులు పుట్టిస్తోంది.
'కరోనా వైరస్' ప్రపంచమే గడగడలాడుతోంది. ఇప్పటికే 60 దేశాల ప్రజలు గజ గజా వణుకుతున్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్ కు మందు కనుగొన లేదు. కనీసం వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. బిక్కు బిక్కుమంటూ జనం వైద్యం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న 'కరోనా వైరస్' పై నటి ఛార్మి చేసిన టిక్ టాక్ వీడియో బూమరాంగ్ అయింది. దీంతో ఆమెపై నెటిజనులు విమర్శల వర్షం కురిపించారు. వరుసగా ట్రోల్ చేశారు. దీంతో దిగొచ్చిన భామ సారీ చెప్పింది.
ప్రపంచాన్ని గజ గజా వణికిస్తున్న కరోనా వైరస్.. భారత్లోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ అనుమానిత కేసులు ఉండగా.. తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఒక్కో కేసు నమోదైంది.
కరోనా వైరస్ ప్రభావంతో పలకరింపులే మారిపోయాయి. ఇదివరకటిలాగా చేతులు కలుపుకోవడం.. షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం.. ఆత్మీయంగా కౌగిలించుకోవడం..ఇలా అంతా మారిపోయింది. ఇప్పుడు కొత్త తరహా పలకరింపులు మొదలయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు 27 దేశాల ప్రజలు గడగడా వణుకుతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొచ్చి పడుతుందోనని భయపడుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 3 వేల మంది మృత్యువాతపడ్డారు.
చైనాను గడగడలాడిస్తున్న 'కరోనా వైరస్' .. కాస్త శాంతించినట్లు తెలుస్తోంది. వుహాన్లో ప్రారంభమై.. అతి కొద్ది కాలంలోనే చైనా అంతటికి కరోనా వైరస్ విస్తరించింది. దీంతో కరోనా వైరస్ పేరు చెబితేనే గజగజా వణికే పరిస్థితి నెలకొంది.
'కరోనా వైరస్' లేదా 'కోవిడ్-19'.. ఈ పేరు వింటనే ప్రపంచవ్యాప్తంగా ఒంటిలో వణుకు పుడుతోంది. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ . . ఇప్పటికే 27 దేశాలకు విస్తరించింది. కరోనా దెబ్బకు ఒక్క చైనాలోనే మృతుల సంఖ్య దాదాపు 2 వేలు దాటింది.
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని వుహాన్ మృత్యుఘంటికలు మోగుతున్నాయి. అక్కడి నుంచి వచ్చిన తెలుగు వారిపైనా అనుమానపు నీడలు నెలకొన్నాయి.
ఆసియాలో అగ్రదేశం అయిన చైనాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా. . కరోనా వైరస్ విస్తృతిని ఆపలేకపోతున్నారు.
ఆసియాలో అగ్రరాజ్యం చైనా . . కరోనా వైరస్ దెబ్బకు గిజగిజలాడుతోంది. కోవిడ్-19 వ్యాధి. . చైనాను అతలాకుతలం చేస్తోంది. చైనాలోని వుహాన్ లో ప్రారంభమైన వైరస్.. చైనా అంతటా మృత్యు ఘంటికలు మోగిస్తోంది.
'కరోనా' అపోహ కాటు వేసింది. అవును కేవలం వైరల్ ఫీవర్ వచ్చిందని డాక్టర్లు చెప్పిన మాట విని కరోనా వైరస్ అనుకుని భయపడి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
కరోనా వైరస్ . . ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న మహమ్మారి ఇది. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ దెబ్బకు ఏకంగా మృతుల సంఖ్య 904కు చేరింది. చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంఖ్య ఇది. కానీ అనధికారికంగా ఇంకా మృతుల సంఖ్య ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోంది.
చైనాలో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా వైరస్ గురించి మరో భయంకరమైన వార్త చైనా బయట పెట్టింది. ఈ కరోనా వైరస్ . . గతంలో వచ్చిన సార్స్ వైరస్ కంటే ప్రమాదమని పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.