బీజేపీ నేత సదానంద గౌడ ఈ రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని.. అది ఆ పార్టీ అంతర్గత విషయమని.. ఆఖరికి వారు పాకిస్తానుకి తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదని సదానంద గౌడ అన్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఓ అబద్ధాలకోరని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నే యూపీ సీఎంపై సిద్ధరామయ్య పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, భారత ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. "మోదీగారు..! కర్ణాటకలో మీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప సాధించిన విజయాలేమిటో 15 నిముషాలు మాట్లాడండి. పేపర్ చూసి మాట్లాడినా చాలు.." అని ఛాలెంజ్ చేశారు.
కర్నాటక ఎన్నికల సందర్భంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన ఆలోచనలను పంచుకున్నారు. కర్ణాటకలోనే కాదు.. యావత్ దక్షిణ భారతదేశంలోనే బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన తెలిపారు.
జమ్ము కాశ్మీర్ కొత్త డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత కవిందర్ గుప్తాను నియమించారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ రిజైన్ చేయడంతో ఆయన స్థానంలో కవిందర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
బీజేపీ కన్నడ ప్రజల స్వాభిమానమే కాదు.. తెలుగు ప్రజల స్వాభిమానం కూడా అర్థం చేసుకోలేకపోతుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తమ నేతల జాబితాను బహిర్గతం చేసింది. ఆదివారం రాత్రి కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 224 సీట్లకు గానూ.. సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వరన్ సహా 218 మంది పేర్లను ప్రకటించింది. సిట్టింగ్ స్థానం వరుణతోపాటు చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీచేయాలని సీఎం మొదట నిర్ణయించారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున 5 సభ్యులతో కూడిన నిజ నిర్థారణ కమిటీ జమ్ము కాశ్మీర్లోని కథువా ప్రాంతాన్ని సందర్శించాలని భావిస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ 19వ తేదిన సుప్రీం కోర్టు నుండి కొంత సమయం అడగనున్నట్లు తెలిపింది.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తమ రాష్ట్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న చంద్ర ప్రకాష్ గంగా, అటవీశాఖ మంత్రిగా ఉన్న లాల్ సింగ్ రాజీనామా పత్రాలను ఆమోదించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.