ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
వైఎస్సాఆర్సీపీ చీఫ్ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్ర' నేటి నుంచి ప్రారంభం కానుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. సుమారు 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు.
ప్రజా సంకల్ప యాత్రకు బయలుదేరే ముందు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తెల్లవారుజామున నైవేద్య సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఆతరువాత రంగనాయకులు మండపం చేరుకొని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు ఉన్నారు.
'తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు ఇస్తున్న వెయ్యి రూపాయల రాయితీని రెండు వేలకు పెంచుతాం' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ్మోహన్ రెడ్డి ప్రకటించారు. బెంగళూరు నుండి రోడ్డు మార్గంలో ధర్మవరానికి చేరుకున్న ఆయన, చేనేతలకు రూ. వెయ్యి రాయితీ కోసం 37 రోజులుగా దీక్షలు చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. దీక్షకు మద్దతు తెలిపిన అనంతరం ప్రజనుద్దేశించి ప్రసంగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.